పుట:Gurujadalu.pdf/532

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది



శెట్టి : బుద్ధి తక్కువకు లెంపలాయించుకుని బేగెళ్లి కథ యెలా వుందో కనిపెట్టండి.

కొండు : సరేగాని ప్రొద్దుపోతూంది. నువ్వు ముందు వెళ్ళి పెరటి గుమ్మం దగ్గర వుండు. నే నిప్పుడే ఆ బోడి పంతులిని బసకు దిగబెట్టి వచ్చి కలుసుకుంటాను... (త్రివిక్రమరావు పంతులుగారి వద్దకు వెళ్ళి) ప్రభువు వారు దయచెయ్యాలి... యేదిరా గుర్రబ్బండీ. తీసుకురా జట్కా! ప్రభువువారి హోదాకి తగినది కాదు కాని - కుచేలుడింటికి శ్రీకృష్ణమూర్తి వారు విజయం చేసినట్టు అనుగ్రహించాలి... సాయిబూ, మా బసకి పోనీయి. ఈ సామాను పట్టించుకుని నౌకర్లతో కూడా నేను వస్తాను.

వెంకటస్వామి : నా గాజు సామానుకు వేరే బండి కావాలి.

కొండు : ఈ బండీ నీకు.

అచ్చన్న: నా లాంతరుకి కొవ్వొత్తులకి వేరే బండీ కావాలి.

కొండు : ఈ బండీ నీకు

అల్లిఖాన్ : పంతులుగారి హుక్కాకీ, లేహం డబ్బాకీ వేరే బండీ కావాలి.

కొండు : ఈ బండి నీకు.

అల్లీ: పంతులుగారి పోషక్‌కు వేరేబండి కావాలి.

కొండు : దానికీ బండి.

బుచ్చన్న: వంట సామానుకో బండి కావాలి.

పాపన్న : ప్రత్యేకం నాకొకబండి మామూలు.

కొండు : మరిలేవు పొండి.

పాప : స్నేహితుణ్ణి, ఆశ్రితుణ్ణి -

కొండు : మరిలేవుబళ్లు, ఒక్కొక్కరే ఓ బండీ యెక్కి వాళ్లు వుడాయించారు.

బుచ్చ : అయితే యీవాళ పంతులుగారు పస్తు పడుకోవాలీ....

కొండు : నడిచి వెళ్ళిపోదాం - మరి బళ్లు దొరకవు.

బుచ్చ : సామానెవడు మోస్తాడు.

కొండు : కూలివాడు ఒకడూ కనపడ్డూ - మనమే మోసుకుపోవాలి.

పాప : మనం - తిమ్మనం - ఆ పప్పుడకదు. నేను ఒక్క వస్తువయినా పట్టుకోను.

బుచ్చ : దొబ్బితిని, భంగుతాగి పంతులుతో మజా ఉడాయించడాన్కి నువ్వున్ను, అరవచాకిరీ చెయ్యడాన్కి నేనూనా!

గురుజాడలు

487

కొండుభొట్టీయము