పుట:Gurujadalu.pdf/516

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

అక్కా : అగ్నిస్తంభమా జలస్తంభమా?

కొండి : స్తంభమనగా నిత్సేష్టగా నిలిచిపోవడము.

ప్రళయ : ఇంద్రియ వ్యాపారాలు అణగడం.

రోమాంచ : వెండ్రుకలు పులకరించడము.

స్వేదం : చమట పొయ్యిడం.

వైవర్ణ్యం : తెల్లపోవడము.

వేపదు : వణకడంము.

ఇవియన్నియు ప్రేమాతిశయ ద్యోతకాలు.

అక్కా : నా వ్యాఖ్యానం వింటారా? దొంగపని చేసి పట్టుబడి బొంకలేకపోతే తెల్లపోవడం, ఒక సరసుడుండగా, మరోసరసుడొస్తే స్తంభః అనగా ఒకడ్ని స్తంభం చాటున దాచడం. సీతాకాలములో సరసుల్లేకుండా వంటరిగా పడుకొంటే వేపదుః, రోమాంచ, అడిగినప్పుడు సరసుడు డబ్బు యియ్యకపోతే ప్రళయం, ఇవి హావభావచ్చేష్టలు.

కొండి : బంగారం గీటు గియ్యనిది నాణెం చెయ్యరు గదా. పండు రుచి చూడందీ తారీపు చెయ్యరు కదా. స్త్రీని అనుభవించి యెంచాలి. సుఖాలు అనుభవ వేద్యాలు గాని వర్ణింప వీలైనవి కావు.

అక్కా : సత్యభామని నేను తగులుకుంటే, యింట్లో యిల్లాల్ని యెవరికివప్పచెప్పను.

కొండి : తమ యిల్లాలు సాక్షాత్తూ రుక్మిణీదేవిలాగు కీర్తి ప్రతిష్టలు సంపాదించి వున్నారు. జ్ఞాపకం తెచ్చారు. వారి నోములుకి నా పౌరోహిత్యం మానివేశారు కదా.

అక్కా : మీరు కాలం అంతా లౌక్యంలో వెళ్లబుచ్చుచున్నారు. చిన్ననాడు చదువుకున్న ముక్కలు జ్ఞాపకం వున్నాయో లేవో.

కొండి : దానిముండా మోసిపోయెను. నిలుచున్నపట్లాన యజ్ఞాదీక్రతువులు చేయించమంటే | చేయించి వేస్తాను కదా, నోములు చేతకాదూ?

అక్కా : తమరే శలవిచ్చారు గదా కంసాల్లు బ్రహ్మల కంటే అధికులని, అంచేతనే వీర సభాచార్యులు మా యిళ్ళలో పౌరోహిత్యం చేస్తున్నాడు.

కొండి : తమకియిదో మెహనత్తు కాదు కాని, మంజువాణి దగ్గర నుంచి చిన్న పని తీసు కొచ్చాను. చిత్తగించారా (పంచకొంగున కట్టబొడ్డు దగ్గర ముడిచిన బంగారపు కమల్ పఠామొలతాడు తీసి) యిది చెరిపి బంగారు గోవతాడు చేయించమంది.

గురుజాడలు

471

కొండుభొట్టీయము