పుట:Gurujadalu.pdf/515

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

కొండి : ఈ కలియుగంలో పాత్రాపాత్ర లెంచడానికి అవకాశమేది. అంతా పాపభూయిష్టమయి యున్నది. “బ్రాహ్మణబీజాయి తేనమః” అన్నాడు, గనుక బ్రాహ్మణ బీజానికి పుట్టితే చాలును.

అక్కా : అదైనా నిశ్చయము కద్దా?

కొండి : లోకం అంతా నమ్మకముతో వుంది. నమ్మకం లేకుంటే అడుగుతీసి అడుగు పెట్టడాన్కి వీలు లేదు. నమ్మియెన్నో వెండి, బంగారాలు లోకులు తమకి స్తున్నారు కారూ? అసాక్షికం లేదంటే యేమిటి చెయ్యడం “నమ్మిచెడిన వారు లేరు. నమ్మక చెడిపోతే చెడిపోయారు” అన్నాడు.

అక్కా : శాస్త్రాలు వదిలి తంబళి పదాల్లోకి వొచ్చారు?

కొండి : భారతంలో యేమన్నాడు “లోకజ్ఞున్” అన్నాడు. అంచేత లోకంలో వేదం మొదలుకొని తంబళి పదాల వరకూ యావత్తుహంశములు తెలిస్తేగాని పండితుడు కానేరడు. ఇదిగో శాస్త్రంలో ముక్క మనవి చేసుకొంటాను. “కంసాలి” అనగా “కంసారి” “రలయోరభేదః” అన్నాడు. గనుక కంసాలి శబ్దార్థం సాక్షాత్తు శ్రీకృష్ణమూర్తి వారని సిద్ధాంతం.

అక్కా : నేను కృష్ణమూర్తిని అయితే సత్యభామని యెక్కడయ్ని ఆలోచించారా లేదా?

కొండి : అదే నేనూ మనవి చెయ్యాలనుకుంటాను. సత్యభామ కోసం యెక్కడికైనా వెళ్లాలా, యేమిటి? తమ యింటి యెదుటనే కాచివేచి యున్నది. మంజువాణి - బంగారు బంతి - దాని రూపురేఖ విలాసాలెషువంటి దనగా ........

అక్కా : అదంత నిజమే కాని, “మిక్కిలి రొక్కము లియ్యక చిక్కదు రా వారకాంత సిద్ధము సిద్దము సుమతీ” అన్నాడు. నేను డబ్బెక్కడ తేను.

కొండి : శ్రీకృష్ణమూర్తి వారియందు సత్యభామకు వలెనే ఈ మంజువాణికిన్ని మీ యందు మనసు లగ్నమయి వున్నది.

అక్కా : అది చెప్పిందా, మీరు పోల్చారా?

కొండి : అది చెప్పనూ చెప్పింది. అయితే మాటల్లో మర్మము వుండవచ్చును కాని, కామశాస్త్రంలో చెప్పిన హావభావచేష్టల్ని పట్టి పండితముండా కొడుకుని ఆపాటి పోల్చలేనా? “స్తంభః ప్రళయరోమాన్‌చ శ్వేదో వైవర్ణ వేపదుః...”.

అక్కా : ఒక్కొక్కటి సెలవివ్వండి.

కొండి : తమర్ని స్మరించేటప్పుటికి "స్తంభః” స్తంభించిపోవడం.

గురుజాడలు

470

కొండుభొట్టీయము