పుట:Gurujadalu.pdf/482

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

 కృష్ణ : (మాధవశర్మతో చిన్న గొంతుకతో రహస్యమాడి, పైకి) “ముఖేహోరావాప్తిః” అన్న శ్లోకము విషయమై మాధవశర్మగారు ఒక చిత్రకథ చెప్పుతున్నారు.

కర్ణ : యేమిటండి?

కృష్ణ : మరేమీ లేదు. ఆ శ్లోకం దాహలాధీశుడైన కర్ణమహారాజును ఉద్దేశించి చెప్పినదట.

కర్ణ : యెంగిలి శ్లోకమా మాకు సమర్పణ అయినది!

కృష్ణ : చాలామంది కవులమనేవారు, యెంగిలి శ్లోకాలవల్లనే ప్రతిష్ఠ సంపాదిస్తారు.

రామ : పరదేశికి యేలినవారియందు భక్తి యెలా వుంటుంది?

కర్ణ : పేరు ఒకటయితే యిట్టి తారుమార్లకు అవకాశం వుంటుంది.

కేశవ : యేలినవారికి తెలియనిది లేదు. ఆ శ్లోకము మట్టుకు మిక్కిలి విలవైనది. చాలాకాలము కిందటనే రచితమయిన యడల, ప్రభువుల యొక్కా పండితులయొక్కా కర్ణగోచరము కాకుండునా? బిల్హణకవి కొత్త శ్లోకం చెప్పే పాటి సామర్థ్యం లేనివాడు కాడు.

రామ : మంచి శ్లోకవఁన్నదీ తలచినప్పుడల్లా స్ఫురిస్తుందా?

(విదూషకుడు ప్రవేశించును)

కర్ణ : ఈయన కాశ్మీర రాజుల ఆస్థానము యేల విడచిరో, యెవరికైనా తెలుసునా?

రామ : మనవి చెయ్యడమునకు వీలులేని కారణము చెబుతారు.

కృష్ణ : తన్ని తగిలేశారని యీ మాధవశర్మగారే చెప్పారు.

మాధవ : నేనా చెప్పాను! తప్పుగా విని వుందురు.

విదూ : ఈ కవిత్వం మాధవప్రణీతవఁయే, వుండాలి.

కర్ణ : (కృష్ణస్వామితో) యెందుకు ఉచ్చాటన ఐందో?

కృష్ణ : కారణమంటూ విశేషకారణ వేఁమీ లేదు. రాజుగారు వుంచిన వేశ్య, సౌందర్యమును చూచి మనసు నిలపబూనినారు కారట.

కర్ణ : ఐతే రసికులే.

విదూ : ఆ మాట కొస్తే, యితర మహాకవుల తక్కువ యేమిటో! కృష్ణమిశ్రి చెప్పినట్టు యెంతటివాడికైనా...

గురుజాడలు

437

బిల్హణీయము