పుట:Gurujadalu.pdf/483

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది



శ్లో|| సంతు విలోకన భాషణ,
      విలాస పరిహాస కేళి పరిరంభాః
      స్మరణ మపి కామినీనామ్,
      అలమిహ మనసోవికారాయ

కర్ణ : అందరికీ తెచ్చారా?

కేశవ : క్షమాపణ మనవిచేసి, ఒక్కసంగతి శృతపర్చుకుంటాను. బిల్హణుడు మహాపండితుడు, దేశదేశములు తిరుగును. అట్టివాడిని అనాదరణచేసిన యెడల, అపకీర్తి సాటగలడు. పండితులు శిక్షార్హులు కారు. “విద్వద్దండ మగౌరవం” అన్నాడు. నేరం యెంతవరకూ వున్నదో, వారు యెంతవరకూ సమాధానం చెప్పుకోగలరో, ఆ తత్వాన్వేషణం కూడా కర్తవ్యమేమో అని సందేహం కలుగుతూంది.

మాధవ : అయితే, తత్వాన్వేషణం చెయ్యనిదీ ప్రభువులు శిక్ష విధించారనా, మీ అభిప్రాయం?

రామ : విష్ణ్వంశసంభూతులగు మహాప్రభువులు, అన్వేషణం అంటూ వకటి చెయ్యవలెనా నిజమును?

"సతాం హి సందేహ పదేషు వస్తుషు
 ప్రమాణ మంతఃకరణ ప్రవృత్తయః

విదూ : ఆ సిద్ధాంతం అందరి మెళ్ళకీ వురి అల్లుకోవడవేఁ. యిప్పుడు ఒహడి పీకకు తగిలిస్తే,రేపు మన పీకకే తగులుకోగల్దు. ఇదుగో నానా మంత్రి వస్తున్నారు. నిద్రపోతూన్నవాళ్ళ పీకలు తెగొయ్యడానికి యింత మహావీరుడు మరి లోకంలో లేడు. ఆ ధర్మ సందేహవేఁ దో ఆయన తీరుస్తారు.

(మంత్రి నానాపంత్ ప్రవేశించును. )

నానా : మహాప్రభో! మహారాజకుమారివారికి భగవద్గీతలు ఉపదేశం చేయించడపు అభిలాష యేలినవారికి కలదని, శ్రీ మాతా మహారాణీ వారితో నవుకరు మనవి చెయ్యగా మిక్కిలి సంతోషముతో వారు ఆమోదించారు.

కర్ణ : మీరు మనవి చేసిన తరవాత, మరివకలాగు యేల ఔను ?

విదూ : పాం విషం పావేం తియ్యాలి.

(నానామంత్రి కోపముతో విదూషకునివైపు చూచును)

కర్ణ : అతని మాటలు సరకు చెయ్యకండి.

గురుజాడలు

438

బిల్హణీయము