పుట:Gurujadalu.pdf/465

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

సౌజ : (తటపటాయించును) మధు : వృత్తి మానినా, మంచి సౌజ : అయితే రావచ్చును. మధు : కృతార్థురాలను, (పుస్తకము వక్షమున ఆని చేతులు జోడించి) శలవు! సౌజ : మరోమాట! (మధురవాణి ప్రశ్నార్థకముగా కనుబొమలెత్తి చూచును) నీకు గిరీశం గారి పరిచయం యెక్కడ? మధు : క్షమించండి. సౌజ : చెప్పవా? మధు : తాము చెప్పక తీరదని ఆజ్ఞాపిస్తే దాటగలనా? పాపము ఆయనను బతకనియ్యండి. సౌజ : అతడి బతుకు మాట ఆలోచించుతున్నావు. వీడు అవ్యక్తుడైతే, పాపము ఆ బుచ్చమ్మ బతుకు చెడుతుంది. అది ఆలోచించావు కావు. మధు : (ఆలోచించి) అవును ఆయన నాకు కొంతకాలం యంగిలీషు చదువు చెప్పేవారు. కొంతకాలం వుంచుకున్నారు కూడాను. సౌజ : యెన్నాళ్ల కిందట? మధు : మొన్నమొన్నటి దాకా. సౌజ : చిత్రం! ఒక్క నిమిషము ఆగు. (పైకి వెళ్లి గిరీశమును వెంటబెట్టుకుని వచ్చి) నెపోలియన్ ఆఫ్ యాంటి నాచ్ గారూ! యీమెను మీరు యెరుగుదురా? గిరీ : కొంతకాలం కింద గిరీశం అనే ఫూలిష్ యంగ్ మాన్ వొకడు వుండేవాడు. మధురవాణి అనే ఆ బ్యూటిఫుల్ నాచిడెవిల్ ఒకతె వుండేది. వాడి దురదృష్టం వల్ల దాని వలలలో చిక్కి మైమరచి అంధకారంలో పడి పోయిన మాట సత్యము. గురువుల ఉపదేశం కొంత కాలానికి జ్ఞప్తికి తెచ్చుకొని, ఆ అంధకారంలోంచి వెలువడి గురువుల పాదములు చేరుకుని గతం కలగా భావించి, మరిచి, మంచితోవలో పడ్డాడు. ఆ గిరీశవేఁ యీ గిరీశం - ఆ మధురవాణే యీ మధురవాణి! స్వర్గానికి ఒక్క చీడీ తరవాయిగా వున్న నన్ను నరకానికి లాగడానికి తిరిగి యిక్కడ నా పురాకృతం వల్ల ఆవిర్భవించింది! ఐ టర్నడ్ ఆల్టుగెదరే న్యూలీఫ్- పాపంలో కాలుజారి, పశ్చాత్తాపపడి, రిఫార్ము అయినాను. నా వంటి సిన్నర్స్ ని సహాయం చేసి మంచివాళ్లని చెయ్యడం తమ బిరుదు గాని, బ్రతుకు చెరచడం న్యాయంకాదు. ఐ క్రేవ్ యువర్ మెర్సీ! గురుజాడలు 420 కన్యాశుల్కము - మలికూర్పు