పుట:Gurujadalu.pdf/466

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

సౌజ : యెన్నాళ్ళైంది చీకట్లోంచి వెలుతురులోకి వురికి? గిరీ : (వూరకుండును) సౌజ : (మధురవాణితో) నువు చెప్పగలవు. గిరీ యెన్నాళైతేనే మండి? ట్రూరిపెంటెన్సు ట్వంటీ ఫోర్ అవర్సు చాలదా అండి? సౌజ : ఔరా? నీలాంటి ఆషాఢభూతుల వల్ల నీ గురువుగారు యెంత సులభంగా దగా పడ తారూ? అరె, నన్ను కూడా భ్రమింపజేస్తివే! నిన్ను మరి చేరనివ్వవద్దనీ, బుచ్చమ్మను పూనాలో విడోజుహోముకు పంపమనీ, మీ గురువుగారి పేర టెల్లిగ్రాం యిస్తాను. ఆమె చదువుకుని ప్రాజ్ఞురాలై తన యిష్టము వచ్చినవారిని పెళ్లి చేసుకుంటారు. లేకుంటే మానుతారు. రిఫారము అయితివని గదా నీవు చెప్పితివి. నిజమైతే, కాలేజీలో ప్రవేశించి, పై పరిక్షలకు చదువుకో. నీ ప్రవర్తన బాగున్నంతవరకు ద్రవ్యసహాయం చేస్తాను. బుద్ధి తెచ్చుకుని బతుకు. మధురవాణిని డెవిలంటివే? నీవే డెవిల్. ఆమె నీ అయోగ్యత అయినా నొక్కి అడిగితే గాని చెప్పింది కాదు. వక సత్యకాలపు బ్రాహ్మడిని కాపాడడమే కాకుండా, దుర్మార్గుడవైన నీ చేతిలో పడకుండా బుచ్చమ్మను కాపాడింది. నాకు వక మహోపకారం కూడా చేసింది. గనుక, నా సంతోషమును తెలియజేయుటకు, యిదిగో ఆమెతో షేక్ హాండ్ చేస్తున్నాను. (షేర్పండ్ చేయును) నెపోలియన్! తక్షణం యింట్లో నుంచి పైకిపో! (గదీ గుమ్మం దాటి) గిరీ : డామిట్! కథ అడ్డంగా తిరిగింది! (తెరదించవలెను) గురుజాడలు 421 కన్యాశుల్కము - మలికూర్పు