పుట:Gurujadalu.pdf/463

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

సౌజ : లేకుంటే చెప్పవా? మధు : చెప్పను. సౌజ : లుబ్ధావధాన్లుగారి వల్ల యెవరికిన్నీ బాధ లేకుండా కాస్తాను. అయనకు కాక ఇతరులు యెవరికైనా హాని చేసి వుంటే, నావశం కాదు. మధు : చాలును. యిహ చెబుతాను. కరటక శాస్తులు గారు వారి శిష్యుడికి ఆడవేషం వేశి పెళ్లి చేశారు. సౌజ : కరటక శాస్తుల్లా గుంటూరు శాస్తులు! మధు : అవును. కొంచెం చిరిగెడ్డం అంట్టించుకున్నారు; అంతే భేదం - సౌజ : ఔరా? అతగాడి దారుణం ! మధు : అతని వల్ల తప్పులేదండి ; అగ్నిహోత్రావధాన్లుగారి కూతురు ఆయన మేనకోడలు. ఆ పిల్లని లుబ్ధావధాన్లుగారికి యివ్వడానికి నిశ్చయమైన సంగతి తమకు విశదమే. ఆ సమ్మంధం తప్పించుటకు కరటక శాస్తులు గారు యీ యెత్తు యెత్తారు. ఆయనకు మాత్రం హాని రానీకండి. సౌజ : ఔరా? యేమి చిత్రము! మేలుకున్నానా నిద్రపోతున్నానా? మధు : నా ఫీజు ఇచ్చి మరీ నిద్రపొండి. సౌజ : బీదవాణ్ణి యిచ్చుకోలేనే? మధు : నాకు లోకంలో ధనవంతా అదే అనుకున్నానే? సౌజ : నీవు సొగసరివి. ముద్దు చేదని కాదు. వ్రత భంగం గదా అని దిగులు. (ముద్దు పెట్టుకొనబోవును) మధు : ఆగండి. సౌజ : ఏమి? మధు : నా వ్రతమో? సౌజ : యేమిటది? మధు : చెడని వారిని చెడగొట్టవద్దని మా తల్లి చెప్పింది. సౌజ : చెప్పితే? మధు : అందుచేత, మిమ్మల్ని ముద్దు పెట్టుకోనివ్వను. గురుజాడలు కన్యాశుల్కము - మలికూర్పు 418