పుట:Gurujadalu.pdf/462

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

సౌజ : అంత మంచి మనిషివి అయితే, పాపము ఆ బ్రాహ్మడికి ఉపకారం నీవు చెయ్యరాదా? మధ్య నాకు గండగత్తెరేమి? మధు : నేను మంచిదాననని నమ్మగలరా? సౌజ : ఆ బ్రాహ్మణ్ణి కాపాడితే నమ్మనా? మధు : అయితే, ఒక తుని తగువు మనవి చేస్తాను. సౌజ : అట్టే సేపు నువ్వు నా యెదట గానీ నిలిచివుంటే, నువ్వు యేతగువు తీరిస్తే ఆ తగువుకు వొప్పుదల అవుతానేమో అని భయవేఁస్తూంది. మధు : (ముఖము పక్కకు తిప్పి) ఒక్క చిన్న ముద్దుకు కరువో? సౌజ : అంతటితో కార్యం నిర్వహిస్తావా? మధు : యేంజేయనూ, మరి? సౌజ : నా వ్రతభంగం చెయ్యడవేఁనా నీ పట్టుదల? మధు : అడుగు మెట్టుకు దిగానని మెప్పులేదు గదా? యిష్టం లేని పని యేల చేయించవలె? శలవు. (రెండు అడుగులు వెళ్లును) సౌజ : ఆగు (మంచము మీద కూర్చుని - దుప్పటి కప్పుకుని) కూచో. మధు : కూచోను. సౌజ : వెయ్యి రూపాయలిస్తాను. తీసుకుని బ్రాహ్మణ్ణి కాపాడు. (మధురవాణి తిరిగి వెళ్లబోవును.) సౌజ : వెళ్లకు - నీకు ముద్దా కావాలి? యేం వెట్టి మనిషివి? యేమిలాభం? మధు : నాకు తెలియదు. సౌజ : తప్పదూ? మధు : తప్పదనుకుంటాను. సౌజ : అయితే విధిలేక వొప్పుకుంటున్నాను. చిత్రం! వెయ్యి రూపాయలకంటే వక ముద్దు యెక్కువ విలవా? సరే - నువ్వు చేసే సాయఁవేదో చెప్పు. మధు : తెల్ల బియ్యం, పాటి మానికా - లుబ్ధావధాన్లు గారు వివాహవైఁన పిల్ల ఆడ పిల్లకాదు. సౌజ : (ఆశ్చర్యముతో) యేమిటీ! మధు : మరచితిని - అందుతో సంబంధించిన వారికి యెవరికిన్నీ హాని రాకుండా కాపాడతావఁ ని శలవిస్తేనే కాని పేర్లు చెప్పజాలను. గురుజాడలు 417 కన్యాశుల్కము - మలికూర్పు