పుట:Gurujadalu.pdf/456

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

గిరీశ : పంతులు గారికి నిద్రభంగవాఁతుంది. మీరు వచ్చిన పనేదో - కొత్త : (సౌజన్యారావు పంతులుతో) స్వాభావికంగా మంచికి లోకం గుడ్డి; చెడ్డ వెతకడానికి చారెడు కళ్లు; గనక, చూస్చూసి, లోకం ఈయన మంచివారు, అని నిర్ధారణ చేసిన తరవాత, వారు మంచివారు కాక తీరదండి తమవంటి మంచివారు వలవేస్తే యెక్కడా కనపడడం కష్టం అండి. గనక తమ దర్శనం నాకు కావడం వల్ల యీరోజు, నా జన్మానికల్లా సుదీనంగా భావించి సంతోషిస్తున్నాను.

సందేహవేఁవింటి!

సౌజ : మంచిగా వుందావలని ప్రయత్నిస్తున్నాను. అంతకన్న నా యందు యోగ్యత యేమీలేదు. మీరు వచ్చిన పని చెప్పారు కారు. గిరీశ : నేను కనుక్కుని తమతో ఉదయం మనవి చేదునా? సౌజ : జరూరు పనిమీద వచ్చినవారూ, పేరు చెప్పని వారూ, మీతో వారి కార్యం చెబుతారా? మీది యెంత సత్య కాలం? గిరీశ : వారికి నేనేమైనా సాయం చేయడానికి అవకాశం వుంటుందేమో అనీ, తమకు నిద్రవేళైందనీ, మనవి చేశాను. కొత్త : గిరీశంగారు లోకోపకారపరులు. సౌజ : మీకు కృత పరిచితులా? కొత్త : వారిని యెరగని వారెవరండి? గిరీశ : వారు నాయందు వుండే దయచేత అలా శలవిస్తున్నారు గాని, నన్ను అంతా యెరగడానికి నేనే పాటి వాజ్ఞండి. అయినా తరుచుగా లెక్చర్లు యిస్తూ వుండడం చాత, వీరివంటి సత్పురుషులు నన్ను యెరిగివుండడం కద్దు; సత్కరించడం కద్దు. వీరిని కూడా నేను చూచివుందును. అందుచేతనే వీరు కనపడగానే, యెవరు చెప్మా చూచినట్టుందీ, అని! కలవిలపడ్డాను. వారు కూడా ప్రచ్ఛన్నులై వుందామని నిశ్చయించుకున్నారు గనక, నేను జ్ఞాపకం తెచ్చుకోడానికి ప్రయత్నం చెయ్యను; నేను పోయి పరుంటాను. తాము ఉభయులు మాట్లాడుకోవొచ్చును. సౌజ : ఆలాగే చెయ్యండి. గిరీశ : (సౌజన్యారావు పంతులుతో) నమస్కారం. (కొత్త మనిషితో) మీరు బ్రాహ్మలా? కొత్త : కాను. గురుజాడలు 411 కన్యాశుల్కము - మలికూర్పు