పుట:Gurujadalu.pdf/434

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

నప్పుడు, తెగని కత్తితో పీకలు తెగ గోస్తారు. మా యినస్పెక్టరికి, సూపరెంటుపని కావాలని ఆశుంది. తసీల్దారికీ వాడికీ బలవద్విరోధం వుంది. ఆ విరోధం మధ్య నన్ను కొట్టేస్తుంది. బైరాగి : చూస్తూ వుండండి. రేపటి నుంచీ పతకం తిరిగిపోతుంది. హెడ్డు : మీ దయ, గురూ - సౌజన్యారావు పంతులుగారని ఓ గొప్ప వకీలుగారున్నారు. ఆయన నాకు చాలా సాయం చేస్తున్నారు. కేసు తేలిపోయే సాధనం ఆయన వొకటి చెప్పారు గాని, అది కుదరక తల్లడిల్లుతున్నాం. బైరాగి : యెమిటండి, ఆ సాధనం? హెడ్డు : పరారీ అయిపోయిన ఆ పిల్లదాని తండ్రి - గుంటూరు శాస్త్రుల్లని ఒకడు వున్నాడు. అతగాడు దొరికితే, కేసు పోతుంది. వాడు యెక్కడా కనపడ్డు. బైరాగి : యిదెంతపని, రాత్రి అంజనం వేసి ఒక్క క్షణంలో కనుక్కుంటాను. హెడ్డు : అలా రక్షించు గురూ, ఆ కుర్రాడు - అనగా ఆ చిన్నది - యిప్పుడు యొక్కడుందో కనుక్కోగలరూ, గురూ? బైరాగి :

అదీ అంజనంలోనే కనపడుతుంది.

హెడ్డు : అదీ మొగాడయినా, ఆడదయినా కూడా కనపడుతుందా గురూ? బైరాగి : ఆడది మొగాడెలా అవుతుందీ భాయీ? హెడ్డు : (తనలో) చెబితే యేం ప్రమాదవో? (పైకి) యీ చిక్కుల్నించి మతిపోతూంది గురూ. దయచేండి యింటి కెళదాం. బైరాగి : యీ శిష్యులకి కొంచెం జ్ఞానోపదేశం చేసి మరీ వస్తాను. మీరు ముందు నడవండి. హెడ్డు : ఈ కార్యం అయిందాకా మీ పాదాలు వొదలను - కార్యవైఁతే తమరు హరిద్వారంలో కట్టిస్తూన్న మఠానికి నూటపదహార్లు దాఖలు చేస్తాను. (అందరూ నిష్క్రమింతురు. ) గురుజాడలు 389 కన్యాశుల్కము - మలికూర్పు