పుట:Gurujadalu.pdf/435

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

3వ స్థలము : డెప్యూటీ కలెక్టర్ కచేరీ ( డిఫ్ట్ కలక్టరు, వకీళ్లు, బంట్రీతులు, మొదలైనవారు ప్రవేశింతురు. ) భీమారావు : నాకు మునసబు కోర్టులో కేసున్నది. వొక అర్జీ దాఖలు చేసి శలవు పుచ్చుకుంటాను. కలెక్టర్ : కోర్టువారికి అవకాశం అయ్యే వరకూ వుండలేని వకీళ్లు కేసు యెందుకు దాఖలు చేయవలె? ఇది చెప్పినట్టల్లా వచ్చే కోర్టనా మీయభిప్రాయం? భీమా : చిత్తం, చిత్తం, తమ ప్రిడిశెసర్లు అలాగు గడుపుతూ వచ్చేవారు.

ఆఫీస్ పని చూసుకుని పిల్చే వరకూ ఉండండి.

అగ్నిహో : (రామప్పంతులుతో) యేమండోయ్ మన కొత్త వకీల్ని కోప్పడుతున్నారే? రామప్ప : (అగ్నిహోత్రావధానులుతో) యీ అధికార్ల నైజం యేమిటంటే యెవళ్ల మీద దయవుండి యెవళ్ల పక్షం కేస్ చెయ్యాలంటే వాళ్ళని కరవ్వొచ్చినట్టు కనపడతారు. మీరు కోరట్ల సంగతంతా తెలుసునంటారే? యిదేనా మీ అనుభవం? అగ్నిహో: (గట్టిగా) అవునవున్నాకు తెలుసును.

యెవరా మాట్లాడుతున్న మనిషి?

నాయడు : (లేచి) తషీర్ మాఫ్ చేస్తే మనవి చేస్తాను. యీయన కృష్ణారాయపురం అగ్రహారం కాపురస్తుడు, నులక అగ్నిహోత్రావధాన్లు గారు; మహా (అ) యోగ్యమైన బ్రాహ్మడు, జటాంతస్వాధ్యాయి, యీయనే లుబ్ధావధాన్లు గారికి తన కొమార్తెను పద్దెనిమిది వందల రూపాయిలకు, కన్యాదానం చేయడానికి బేరమాడుకుని, కాబోయే అల్లుడికి దేహశుద్ధి చేశారు; అందుకే యీ మధ్య లుబ్ధావధాన్లు గారు యేలినవారి కోర్టులో ఛార్జీ దాఖలు చేశారు; అందులో ముద్దాయీ యీ మహానుభావుడే! మల్లవరంలో సహస్రమాసజీవైన వక బ్రాహ్మణ శ్రేష్టుడుంటే, ఆయనకు తన పెద్ద కుమార్తెను కన్యాదానం చేసి, రెండు పిల్లికూనలు స్వీకరించేటప్పటికి పెళ్లిలోనే ఆ బ్రాహ్మడి పుణ్యం అంతామూడి పరం పదంవీంచేశాడు. ఆ పిల్లదాని తరపున భూముల కొరకు దావా తెచ్చారు. వీరు తమవంటి గవర్నమెంటు ఆఫీసర్లకి తరుచుగా పనిగలుగచేసి ప్లీడర్లని పోషిస్తూ వుంటారు. వీరి యోగ్యతలేమి, వీరి దయాంతఃకరణలేమి, వీరి సరసత లేమి, మరి యెన్నడమునకు శేషుడికైనా అలవి కాదు. వారి తరఫున కేసు దాఖలు చెయ్యడం కోసమే భీమారావు పంతులుగారు కోర్టుకు దయ చేశారు. (విరసముగా నవ్వి కూరుచొనును. )

బలే శాబాష్ (గుమాస్తాతో) ఏదీ భీమారావు పంతులు గార్ని ప్రియాదు అర్జీ దాఖలు

చేయమను. (గుమస్తా పుచ్చుకొని దాఖలు చేయును.) కన్యాశుల్కము - మలికూర్పు గురుజాడలు 390