పుట:Gurujadalu.pdf/433

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

రామన్న: యేం యెఱ్ఱముండా పని చేసినారు భాయీ! బంగారం చేసే సిద్ధులికి డబ్బు లచ్చంటోయి? ఆరికాళ్ల మీద పడి అలక తీరుసుకొండి. దుకా : వుండోస్సి - యేడిసినట్టే వుంది. నీ సొమ్మేం పోయింది? (హెడ్ కనిష్టీబు ప్రవేశించును. ) హెడ్ : యేమండోయి గురోజీ! మీరు దొరకడం నాకు దేవుఁడు దొరికినట్టుంది. ఇక బతికాను. మీతో కొన్ని జరూరు సంగతులు మాట్లాడాలి, రండి. బైరాగి : భాయీ మీరు వెనక్కుండండి. (దుకాణదారు తప్ప తక్కినవారు దూరముగా వెళ్లుదురు.) దుకా : నా డబ్బిచ్చి మరీ మాట్లాడండి. బైరాగి : నలుగురిలోనూ మర్యాద తియ్యడం ధర్మ వేఁనా తమ్ముడా? యోగరహస్యాలు పామరుల దగ్గిరా వెల్లడి చెయ్యడం? దుకా : డబ్బు యెగెడ్డపుయోగం నా దగ్గిర పారదు. రహస్యవేంటి? ఆ విద్యకి అంతా గురువులే! బైరాగి : వెట్టి నరుడా! బైరాగి వాళ్లకి మాకు డబ్బు మీద తనుపుంటుందfయి? ఒకళ్లకి యిచ్చేదీ కానం - పుచ్చుకున్నదీ కానం. హెడ్డు : భాయీ! నీ రూపాయలు నేనిస్తాను. తెలివి మాలిన మాటలాడకు. గురువు గారికి కళ్లు మొయ్యా ఆగ్రహవొస్తే మనం మండిపోతాం. మీరటుండా, వెళ్లండి. (బైరాగితో) గురోజీ! కూనీ కేసు పీకల మీది కొచ్చింది. కేసూ, యే బుగ్లీ లేనిదే, ఆ రాత్రి నాలుగు రాళ్లు తడువుఁకుందావఁని మనం ఆ ముసలాణ్ణి అల్లరి పెట్టావాఁ? ఆ తరవాత, అని బెదిరించి పదిరాళ్లు లాగాడు. తన తాలూకు కంటే పెగిలింది కాదని రావఁప్పంతులుగాడు యినస్పెక్టరికీ పోలీసు సూపరెంటుకీ అర్జీలు కొట్టాడు. నిజంగా కూనీ కేసు జరిగి వుండగా, మేవుఁ కామాపు చేశావఁని తాసిల్దారు మీదా, నా మీదా యిప్పుడు పితూరీ చేస్తున్నారు. బైరాగి : మేవుఁండగా మీకేం భయం, భాయి? హెడ్డు : అందునే గదా, నా పాలిటి దేవుఁళ్లా మీరు దొరికారన్నాను. బైరాగి : మీ శత్రువులకు వాగ్బంధం చేస్తాను. వాళ్ల పేర్లు వ్రాసి యివ్వండి. యినస్పెక్టరుకి మీమీద యిష్టవఁని చెప్పేవారే? హెడ్డు : యీ పెద్ద ఉద్యోగస్థులకి దయలూ, దాక్షిణ్యాలూ యేవిఁటి గురూ? వాళ్లకి యంత మేపినా, వాళ్లకి కారక్టు వొస్తుందని గానీ, ప్రమోషను వొస్తుందని గాని, ఆశపుట్టి కన్యాశుల్కము - మలికూర్పు తాసిల్దారొచ్చి “హా . గురుజాడలు 388