పుట:Gurujadalu.pdf/411

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

అగ్ని : మా అయ్యవారు మట్టుకు మంచి బుద్ధిమంతుడూ, తెలివైనవాడూనండి-కోర్టు వ్యవహా రాలలో అతనికి తెలియని సంగతి లేదండి. అంత బుద్ధిమంతుణ్ణి నేను యక్కడా చూడలేదు. ఆయన్ని చూస్తే మీరూ అలాగే అంటారు. రామ : యెంత బుద్ధిమంతుడైనా మీ కొహడు సలహా చెప్పేవాడున్నాడండీ? (చెవులో) మరో మాట-మీ అయ్యవారు గిరీశం గాడు కాడండీ? వాడు లుబ్ధావధాన్లు వింతల్లి కొడుకుగదా? మీకా వాడు, యీ కేసుల్లో సరైన సలహా చెబుతాడు? అగ్ని : అవునండోయి! రామ : నియ్యోగపాణ్ణి నా మాట కొంచం ఖాతరీ చెయ్యండి. గనక, ఆ అయ్యవార్ని తోడిచ్చి, పిల్లల్ని యింటికి పంపించెయ్యండి. యెకాయెకిని మనం తక్షణం వెళ్లిపోయి, లుబ్ధావధాన్లు కన్న ముందు ముక్క తగిలించెయ్యాలి. యేదో ఓ సరుకు వేగిరం పట్టుకురండి. అగ్ని : యేదీ, అమ్మిని యిలా పిలువు. వెంకమ్మ: అమ్మేదీ చెప్మా? బద్దకించి బండిలో పడుకుంది కాబోలు. పిలువమ్మా. అగ్ని : మనకి డామేజీ దిట్టంగా వొస్తుందా? రామ : వొస్తుందంటే, అలాగ యిలాగానా? ఒకడు : అమ్మన్నగారి బండీ యక్కడా కనపడదు; బండీ వెనకపడిపోయింది కాబోలు. వెంకమ్మ: అడుగో అబ్బి వున్నాడే? వీడెలా వొచ్చాడు? అబ్బీ నువ్వు అక్కయ్య బండిలో కూచోలేదురా? వెంకటేశం : లేదు. నేను యేనుగెక్కాను. అగ్నీ : దొంగగాడిద కొడకా అయ్యవారేడ్రా? వెంకటేశం : యెక్కడా కనపడ్డు. అగ్నీ : గుఱ్ఱం వొచ్చిందా? గుఱ్ఱపాడేడీ? వెంకటేశం:

గుఱ్ఱపాడు చెప్పాడు -

అగ్ని : యేవిఁట్రా, వెధవా, చెప్పాడూ? వెంకటేశం : మాష్టారూ - రాత్రి - అగ్ని : నోటంట మాట పెగల్దేం? వెంకటేశం : గుఱ్ఱం దిగి కన్యాశుల్కము - మలికూర్పు బండీ యెక్కాట్ట. గురుజాడలు 366