పుట:Gurujadalu.pdf/412

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

వెంకమ్మ: అయ్యో దాన్ని లేవదీసుకు పోలేదు గద? దగ్గిరనున్న వారు : ఆఁ! ఆఁ! వెంకమ్మ: కొంప ములిగిపోయింది, మరేవిఁటి ! (చతికిలబడును)

(కోపము చేత వణుకుచు) అయ్యవారు పకీరు ముండని లేవతీసుకుపోయాడూ?

నగలపెట్టె? నా కోర్టు కాగితాలో ? వెంకటేశం : అక్కయ్య పెట్లో నా పుస్తకాలు కూడా పెట్టాను. అగ్ని : దొంగ గాడిదె కొడకా! నువ్వే వాణ్ణి యింట్లో పెట్టావు. రవంత ఆచోకీ తెలిసింది కాదు. దొంగ వెధవని చంపేసిపోదును. గాడిదె కొడుకును అమాంతంగా పాతి పెట్టేడును. రామ : (దగ్గరకు వచ్చి) అయ్యవారు మహా దొడ్డ వాడని చెప్పారే? యేమి యెత్తుకు పోయినాడేమిటండి? అగ్ని : యేవిఁ యెత్తుకుపోయినాడా? నీ శ్రాద్ధం యెత్తుకుపోయినాడు. పకీరు ముండని యెత్తుకు పోయినాడు. యీ గాడిదె కొడుకు యింగిలీషు చదువు కొంప ముంచింది. (వెంకటేశం జుత్తు పట్టుకొని కొట్టబోవుచుండగా తెరదించవలెను.) 3వ స్థలము : విశాఖపట్టణములో మధురవాణి బస యెదటి వీధి (రామప్పంతులు, అగ్నిహోత్రావధాన్లు, ప్రవేశింతురు) అగ్నిహో: మనం పోలిశెట్టి దగ్గిర బదుళైచ్చిన రూపాయి లన్నీ అయిపోయినాయి; యప్పటికీ ఖర్చులు ఖర్చులే అంచారు; నా దగ్గిర వక దమ్మిడీ లేదు. రామ : ఖర్చు కానిదీ కార్యాలవుతాయిటయ్యా? మీ కడియం యెక్కడైనా తాకట్టు పెట్టండి. అగ్ని : యీవూళ్లో మనం యెరిగిన వాళ్లెవరున్నారు? రామ : రండి మధురవాణి దగ్గిర తాకట్టు పెడదాం. అగ్ని : చేసేవి మాఘస్నానాలూ, దూరేవి దొమ్మరి కొంపలూ అని, జటాంత స్వాధ్యాయిని నన్ను ముండలిళ్లకి తీసికువెళతావషయ్యా? కన్యాశుల్కము - మలికూర్పు గురుజాడలు 367