పుట:Gurujadalu.pdf/410

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

అగ్ని : పింజారీ! వూరుకో-ఆడముండలకేం తెలుసును? అన్నగారూ, క్రిమినల్ కేసు తావడానికి అవకాశం వుంటుందా? మా దగ్గిర అయ్యవారూ ఒకాయన వున్నారు. ఆయనకి లా బోగట్టా మాబాగా తెలుసును. ఆయన్ని కూడా సలహా చేదాం. రామ : కోర్టు వ్యవహారాల్లో ఆరితీరిన మీకు ఒహడు సలహా యివ్వాలండీ? స్థలజ్ఞుణ్ణి గనక సాక్ష్యం గీక్ష్యం తేవడానికి నేను సాయం చేస్తానన్నాను గానీ, అయ్యవార్లు, గియ్యవార్లూ మీకు నాకూ సలహా చెప్పేపాటివాళ్లా? గుంట కక్కగట్లు రెండు యింగిలీషు ముక్కలు చదువుకున్నారు గనక ముక్కస్యముక్కార్థః అని తర్జుమాలు మట్టుకు చేస్తారు; గాని యేదయినా యెత్తుయెత్తావంటే, తమలాంటి యోధులు యెత్తాలి, నాలాంటి నియ్యోగపాడు నడిపించాలి. క్రిమినలుకి అవకాశం వుందా అని అడుగుతారేవిఁటి? మీకు తెలియదా యేవిఁటి! - అటుపైని సులభసాధ్యంగా మూడు నాలుగువేలు డామేజీ కూడా సివిల్లో లాగేస్తారు. అగ్ని : అదే, నా ఆలోచన. రామ : తీరిపాయె; మళ్లీ యిహ సలహాకేవుఁంది. వెంటనే వెళ్లి ముక్క తగిలించేదాం. ఖర్చులికి సొమ్ము పట్టుకుని బయలుదేరండి. అగ్ని : నా దగ్గిర దమ్మిడీ లేదు; యేమి సాధనం? ఈ గాడిదె కొడుకు రూపాయలిస్తాడని నమ్మి, నేనేమీ తేలేదు. రామ : యింటికి వెళ్లి లెబ్బపట్టుకు వొచ్చేటప్పటికి పుణ్యకాలం మించిపోతుంది. “శుభస్చశీఘ్రం” అన్నాడు - మీ ఆలోచనేవిఁటి? అగ్ని : యిదేదో అయితేనే గాని యింటి మొహం చూసేది లేదు. మా అమ్మి సరుకేదయినా ఈ వూళ్లో తాకట్టు పెడదాం. రామ : అయితే పట్టుకురండి; పోలిశెట్టి దగ్గర తాకట్టు పెడదాం; పోలిశెట్టిని మనం కొంచం మంచి చేసుకోవడం ఆవస్యకం. మీరు లుబ్ధావధాన్లుని కొట్టినప్పుడు-పోలిశెట్టి వున్నాడు గనక, లుబ్ధావధాన్లు మీమీద ఛార్జి చేసినప్పుడు, పోలిశెట్టిని తప్పకుండా సాక్ష్యం వేస్తాడు. శెట్టిని మనం విడతియ్యడం జరూరు యేవఁంటారు? అగ్ని : మీ సలహా మా బాగా వుంది. నాకూ అదే భయ వేఁస్తూంది. రామ : చూశారా, ప్రతి వాడికీ సలహా చెప్పడం చాలౌతుందండీ? అందులో యీ యింగిలీషు చదువుకున్న అయ్యవార్లని సలహా అడిగితే, కేసులే తేవొద్దంటారు. దొంగ సాక్ష్యాలు తావొ ద్దంటారు. వాళ్ల సొమ్మేం పోయింది. యే మాలకూడూ లేకపోతే కేసులు గెలవడం యలాగ? గురుజాడలు 365 కన్యాశుల్కము - మలికూర్పు