పుట:Gurujadalu.pdf/409

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

శిష్యు : “నీలాలకా యేల నీ యలుకా? " అగ్ని : యలకేవిఁటి నీ శ్రాద్ధం? శిష్యు : యలక్కాదు, పిల్లి. (పాడును) “పిల్లన్న తెయితక్కలాడంగనూ! యలక లేరూగట్టి దున్నంగనూ!” అగ్ని : యేవిఁటీ? శిష్యు : "మేక పిల్లలైండు మేళాంగట్టుకుని, మేరంగి తీర్థాని కెళ్లంగనూ”|| అగ్ని : యేవిఁటి నీ శ్రాద్ధం పాట! శిష్యు : “తొండాయ నేస్తూడు, దొనిగఱ్ఱబట్టుకుని1 తోటమల్లీ పువ్వు లేరంగను||" అగ్ని : పాడావంటే తంతాను. శిష్యు : అయితే నీకు మరి యిల్లు చూపించను. అగ్ని : పాడగట్టా - (కొట్టబోవును) శిష్యు : (తప్పించుకు పారిపోతూ) “గట్టుకిందానున్న, పందాయనేస్తూడు మరిగబుకూ మరిగుబుకూ"|| (నిష్క్రమించును) అగ్ని : వీడి శ్రాద్ధం చెట్టుకింద బెట్టా, తోవ యిటా? అటా? (తెరదించవలెను) 3వ స్థలము : చెఱువుగట్టు తోట (అగ్నిహోత్రావధాన్లు, రామప్పంతులు, వెంకమ్మ, యితరులూ.) అగ్ని : గాడిదెకొడుకుని మా చెడ్డ దెబ్బలు కొట్టేశాను; యేనుగులూ గుల్జాలూ తెచ్చాను వీడి శ్రాద్ధం మీదికి! తోవ ఖర్చయినా వొక దమ్మిడీ ఇయ్యడష, వెంకమ్మ : మన తెలుబ్ధం - నేన్నోచిన నోవుఁలు యిలా వుండగా, మరోలా యలా అవుతుంది? యీ సంమ్మంధం వొద్దని పోరితే విన్నారూ? నేను భయపడుతూనే వున్నాను. బయల్దేరేటప్పుడు పిల్లి యెదురు గుండా వొచ్చింది. గురుజాడలు 364 కన్యాశుల్కము - మలికూర్పు