పుట:Gurujadalu.pdf/370

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

లుబా : నవ్వుతావేఁవే భ్రష్టాకారిముండా? నువ్వూ, నీ సవిత్తల్లీ నన్ను చంపేసి రాజమహేంద్రం పారిపోయి, వెధవపెళ్లి చేసుకుంటారు. నాకు తెలుసును. గిరీశం గాడు అన్న మాట నిజం. వెధవని చెవిపెట్టాను కాను. నా సొమ్మంతా ఘటాశ్రాద్ధప వెధవల పాలవుతుంది. నువ్వుపో, నేను పడుకుంటాను. (పక్కమీద పడుకుంటూ) మళ్లీ వొస్తాడు గాబోలా దేవుడా! మీనా : యవరు నాన్నా? లుబ్ధి : నువుపో, నీకెందుకు! ఆ వెధవ నా పీక పిసికేస్తాడు. నీ కోరిక తీరుతుంది. మీనా : మీరలా అంటే నాకు యేడుపొస్తుంది. నేనిక్కణ్ణించి కదలను. యవడా పీకపిసికేవాడు? లుబా : అయితే యిక్కడ పక్కేసుకుపడుకో మీనా : పడుకుంటాను. యవడు మీ పీక పిసుకుతాడు? లుబ్ధా : ఆ ముండ మొదటి మొగుడే. యిందాకా నువు రాకముందు, నా గుండెల మీదెక్కి, పీక పిసికేటప్పటికి ప్రాణం పోయిందనుకున్నాను. మీనా : నిజంగానూ ! కలగన్నారు కాబోలు - నాన్నా! లుబై : కలెక్కడి కలే! వీక నులుచుకుపోతేనూ! మీనా : మొదటి మొగుణ్ణి మీకేం తెలుసును? లుబ్ధి : వాడే, చెప్పాడే! వెధవా! “నా పెళ్లాన్ని పెళ్లాడావు; నిన్ను చంపేస్తాన”న్నాడే. మీనా : యలా వుంటాడు? లుబ్ధా : గిరీశంగాడి మూడు మూర్తులూనే. మీనా : కలకాబోలు నాన్నా. అదే తలుచుకు పడుకుంటే, చిన్నబాబు కల్లోకొచ్చాడు కాబోలు. లుబ్దా

నేను చస్తే యవరికి విచారం!

మీనా : ఆ పిల్లని వెళ్లి అడుగుదునా? లుబై : వొద్దు, వొద్దు. తొందరపడకు. మీనా : నన్ను తిట్టేస్తున్నారు, దాని చచ్చిన మొగుడు మిమ్మలిని చంపేస్తాడని భయపడుతున్నారు. యెందుకీ తంబళ అనుమానం? ఓ మాటు దాన్నేడిగేస్తే ఉన్న నిజం తెలిసిపోతుంది. లుబ్దా

నిజం నీతో చెబుతుందీ?

మీనా : నాతో నిజం చెబుతుంది. అది వొట్టి సత్యకాలప్పిల్ల. నాకు యంతో వుపచారం చేస్తుంది. కన్యాశుల్కము - మలికూర్పు గురుజాడలు 325