పుట:Gurujadalu.pdf/371

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

లుబ్ధి : దాన్ని పాడుచేస్తున్నావూ? మీనా : యిలాంటి మాటలంటేనే నాకు అసయ్యం. మీరు యక్కడో దడుసుకున్నారు కాబోలు; అంచేత దుష్టుకల వొచ్చింది. అంతేగాని, రెండో పెళ్లి, మూడో పెళ్ళి అని వెల్లులు వోడకండి. పూజారి గవరయ్యని పిలుస్తాను; అతగాడు యింత మంత్రించి వీపూది యిస్తాడు. రాసుకు పడుకొండి. లుబా : కొంపతీస్తావా యేవిఁటి? వాడొస్తే, వాడితో యేవఁని చెప్పడం? దాన్నే నిజం అడుగుదూ. మీనా : నే నడగను, నాన్నా, నన్ను అడ్డవైఁన మాటలూ అంటూంటే, నే నెందుకు అడుగుతానూ? నేం దాంతో యిగమాట్లే ఆజ్ఞు. లుబై : నా తల్లివి కాదూ, అడుగమ్మా. (మీనాక్షి పైకి వెళ్లును. ) ఓపన్నం యాకర బెట్టేదా? గాయత్రీ స్మరణ చేసేదా? వేదాలూ, మహామంత్రాలూ, యీ దెయ్యాలకి పేలపిండి వొడియాలు. శాపర మంత్రాలు ఉపదేశం అవుదావఁంటే, బెడిసిగొడతాయేమో అని భయం. యేవిఁసాధనం? “ రామనామతారకం” స్మరణ చేస్తాను. “ రామనామ తారకం1 భక్తిముక్తిదాయకం| జానకీ మనోహరం! సర్వలోక నాయకం! రామనామ తారకం! రామనామ తారకం” యీ ముండ యింట్లో వుంటే, నే బతకను. “ రామనామతారకం! రామనామతారకం!” రుద్రాక్షతావళం యేదీ? చము అంచున కూచుని పరుపుకింద తడివిఁ, రుద్రాక్షతావళం తీయుచుండగా మీనాక్షి ప్రవేశించి) మీనా : మీ మాట నిజవేఁ నాన్నా. లుబ్దా : నిజవేఁ! (మంచము మీది నుంచి కింద కూలబడును.) లుబా మీనా : (లేవదీసి) నాన్నా! నాన్నా! పడిపోయినా వేవిఁ!

యేవీఁ లేదు, నిజవేఁ! నిజవేఁ!

మీనా : నిజవేఁను, ఆ మొగుడు యిప్పుడే దానిక్కూడా కనపడి, “ముండా, మళ్లీ పెళ్లాడావే? నీ కొత్త మొగుణ్ణి పీక పిసికేస్తాను చూడు” అన్నాట్ట. కన్యాశుల్కము - మలికూర్పు గురుజాడలు 326