పుట:Gurujadalu.pdf/369

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

లుబ్ధా : వెధవ తండ్రీ! బోడి తండ్రిని! గాడిద కొడుకు రెండో పెళ్లి ముండని నా పీకకి ముడేసి అమాంతంగా నా కొంప ముంచాడు! యిహ బతకను యిహ బతకను. మీనా : “రెండో పెళ్లి ముండ, రెండో పెళ్లి ముండ” అని శుభమల్లే అనకండి. మీరే యిలా సాటుతూ వుంటే వూరంతా అనడం ఆశ్చర్యవాఁ? మాట్లాడక వూరుకోండి. లుబ్ధా : వూరుకోవడవెఁలాగే? మనవూరా? మన దేశవాఁ? రెండో పెళ్లి ముండ కాకపోతే ఆ తండ్రి వెధవ, పేరయినా చెప్పకుండా పారిపోవడవేఁవిc? మీనా : సిద్ధాంతితో చెప్పాట్టే, పేరు? లుబ్దా : వాడి శ్రాద్ధం చెప్పాడు. సిద్ధాంతి గడియకో పేరు చెబుతున్నాడు. మీనా : అతగాడికి మాత్రం కొత్తవాడి పేరు జ్ఞాపకం వుంటుందా యేవిఁటి? మన పిల్ల మన యింట్లో వున్న తరవాత అతగాడి పేరుతో మీకేం పని? లుబ్దా : యీ పెళ్లాం ముండ నా యింట్లో వుంటే నేను చచ్చిపోతాను, మరి బతకను. మీనా : వెట్టి కేకలెయ్క నోరు మూసుకుని వూరుకోండి. యిరుగు పొరుగువారు నవ్వగలు. మీ మావఁగాఁరు యంతపండితుడు, యంత దొడ్డ మనిషి! లేనిపోని అనుమానాలు పెట్టుగోకండి. పసిపిల్ల బెంగెట్టుకోగల్డు. లుబ్ధా : ఓసి భ్రష్టా! వాడు నీకేవఁయినా యిచ్చాడా యేవిఁటే, వాణ్ణి వెనకేసుకు మాట్లాడు తున్నావు? నీకు నేను చచ్చిపోవాలని వుంది కాబోలు! మీనా : యేవిఁటా మతిపోయిన మాటలు! అతగాడు రేపో నేడో వొచ్చి, యిలాంటి మాట్లన్నం దుకు మన నోట్లో గడ్డి పెడతాడు. లుబ్ధా : అతగాడెవడు. వొల్లకాట్లో రావఁనాధాయ? మరెక్కడొస్తాడు వాడు! యిహ, నాకు చావు సిద్ధం. మీనా : మీకు చావేం వొచ్చింది యిప్పుడు? ఒహవేళ రెండో పెళ్లి పిల్ల అయితే మాత్రం, గుప్ ప్ అని వూరుకోవాలి గాని, అల్లరి చేసుకుంటారా? యీరోజుల్లో యంతమంది రెండో పెళ్లి చేసుకుని సుఖంగా వున్నారు కారు? పిల్ల బుద్ధిమంతురాలు. మీ అదృష్టం వల్ల దొరికింది. మాట్లాడక వూరుకోండి. లుబై : నా అదృష్టం తగలబడ్డట్టే వుంది. నీకేం పోయీకాలం వొచ్చిందే! నువ్వుకూడా యీ కుట్రలోచేరి, నీ తండ్రికి కళ్లుగప్పి వెధవ పెళ్ళి చేశావే? అయ్యో వెధవని పెళ్లి చేసు కున్న కుంకవెధవా నీ బుద్దెక్కడికి పోయిందిరా? నీ చదువెక్కడికి పోయిందిరా? నీ వేదం తగలబడనూ యిహ బతకను! (మీనాక్షి నవ్వును) కన్యాశుల్కము - మలికూర్పు గురుజాడలు 324