పుట:Gurujadalu.pdf/368

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

కన్యాశుల్కము పంచమాంకము 1వ స్థలము : లుబ్ధావధాన్లు పడకగది లుబ్ధావధాన్లు మంచముమీద పరుండివుండును. నిద్రలో అరచి, కాళ్లూ చేతులూ కొట్టుకుని, లేచి కూచుని, వణక నారంభించును. లుబ్ధా : అసిరిగా! అసిరిగా! అమ్మీ! చంపేశాడట్లోయి. రామనామతారకం! రామనామతారకం! రామనామ తారకం | రామ నామ తారకం|| యిది రెండో పెళ్లి ముండే. దీని మొగుడు పిశాచవైఁనాడు - నా పీక పిసికి చంపేస్తాడు. యేవిఁటి సాధనం? రామనామతారకం రామనామతారకం (తలుపు అవతల నుంచి) అసిరిగాడు యేటి బాబూ? యేటి బాబూ? (తలుపు తట్టును) మీనా : యేవిఁటి నాన్నా, తలుపు తీయ్యి. లుబా : (తనలో) కాళ్లు ఆడవు. చేతులు వొణుకు తున్నాయి. (తలుపు తీయును; అసిరిగాడితో) వెధవా నువ్వు లోపలకి రాకు. అసిరి : నాను పిలుస్తాస్సినాను (నిష్క్రమించును) (మీనాక్షి - శిష్యుడు ప్రవేశింతురు) లుబ్ధా : (మీనాక్షితో) ఆ ముండని అవతలుండమను. మీనా : నువ్వు మన గదిలోకి వెళ్లిపో అమ్మా (శిష్యుడు గది అవతలకి వెళ్లును) యేవిఁటి నాన్నా? లుబై : యిహ, నే బతకను. మీనా : యేవొచ్చింది నాన్నా, కడుపునొప్పా, కాలు నొప్పా. లుబా : కడుపునొప్పీ కాదు, కాలునొప్పీ కాదు, వెధవ ముండని పెళ్లాడిన కుంకపీనుగ బతకడం యలాగ? మీనా : యేవిఁటా వోగాయిత్యం మాటలు, నాన్నా? మీకు యీ లేనిపోని అనుమానం యవరు పెట్టారు? లుబ్దా అనుమానవేఁవిటి? నిజం, నిజం, నిజం వూరంతా అదేమాట.

యీ రావఁప్పంతులే యిలాంటి అపవాదలన్నీ వేస్తూ వుంటాడు. కనపడ్డ వాడితో అల్లా

వూసు పెడితే, వూరంతా అనుకోరూ? బంగారం లాంటి పిల్లని యిలాంటి మాటలని బెంబేరు పెట్టకండి. తండ్రి వెళ్ళిపోయినాడని అది రాత్రీ పొగలూ యేడుస్తూంది. కన్యాశుల్కము - మలికూర్పు

- గురుజాడలు 323