పుట:Gurujadalu.pdf/352

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

పూజా : హెడ్డు గారితో యేవిఁటి మాట్లాడుతూందనుకున్నావు? పంతులుగారు సరుకూజప్పరా, పెట్టుకు వెళ్లారు. యేం ప్రమాదం వొచ్చిందో! ముహర్తం వేళకి రాలేదు, జవాన్లని పంపి వెతికించండి అని బతిమాలుకుంటూందిరా. కొండిబొట్లు :ఈ గవరయ్యగారు గోతాలు కోస్తాడ్రా. హెడ్డూ, అదీ, ఒహరి మీదొహరు విరగబడి నవ్వుతూంటే, పంతులు కోసం బెంగెట్టుకుందని కవిత్వం పన్నుతాడు. రామ : వైదీకం! వైదికం! మీ యేడుపులు మీరు యేడవక, లోకంలో భోగట్టా అంతా మీకెందుకు? పూజారి :వూరుకోరా కొండిబొట్లు. పెద్దాపిన్నా అక్కర్లేదూ? రామ :నీ పెద్దతనం యెక్కడ యేడిసింది? నివ్వే ముందు రేపెట్టావు. పూజారి :వై, స, బు, పె అని యందుకన్నాడు బాబూ? రామ : అతడేడీ, అతడు? అతడి పేరేవిఁటీ? పూజారి: యవరండి? రామ : ఆ గుంటూరి శాస్తూట్లేడయ్యా ? పూజారి : యే గుంటూరి శాస్తుల్లండి? లుబ్దా : ఆయనా, మరే వొచ్చి, ఆయనా - వూరికెళ్లారు. రామ : యేవిఁటీ తెలివితక్కువ మాట! కూతురికి పెళ్ళెతూంటే వూరికెలా వెళ్ళాడు? లుబ్దా:

పెళ్లయిపోయింది గదా ?

రామ : తెలివిహీనం! లగ్నవఁంటే నేను లేకుండా వెలిగించావు గానీ, పెళ్లి ఐదు రోజులు తగలడుతుంది గదూ? - పూజా : ఏకరాత్ర వివాహం కదండీ? అంచేత ప్రధాన హోమం, శేషహోమంతో సమాప్తి అయిపోయింది. రామ : (నిశ్చేష్టుడై లుబ్ధావధాన్లుతో) ఓరి, సామిద్రోహప వెధవా! పూజారి : నోరుమూసి, బాబ్బాబూ. శాంతించండి! శాంతించండి! (లుబ్ధావధాన్లుతో) పంతులుగారి కాళ్ల మీద పడవయ్యా. (పంతులుతో) తమరు చేయించిన శుభం. అశుభం మాటలు శలవియ్యకండి. సిద్ధాంతి గారూ, వారిమావఁగారూ, శాస్త్ర చర్చ చేసి, లగ్నం పదినిమిషాలుందనగా ఏకరాత్ర వివాహం స్థిరపర్చారు. రామ : యేం కుట్ర! వాడికి రూపాయలివ్వ లేదు గద ? గురుజాడలు 307 కన్యాశుల్కము - మలికూర్పు