పుట:Gurujadalu.pdf/351

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

పసుబ్బట్టలూ, పెళ్లి కూతురుతో కలిసి కూచోడవూఁను? పెళ్లి కొడుకుం చేయించుకున్నావటయ్యా? ముదిమికి ముచ్చట్లులావు. లుబ్ధా : లగ్నానికి మీరు లేకపోయినారు గదా! అని మహా విచారపడుతున్నాను. రామ : (ఉలికిపడి) యేవిఁటీ! లగ్గవేఁవిఁటి? పూజారి గవరయ్య :లగ్నం వేళకి తమరు లేకపోయినారు గదా అని, మేం యావన్మందివీఁ విచారించాం. తమరు యేదో వ్యవహారాటంకం చేత వేళకి రాజాలినారు కారనుకున్నాం. తాము లేకపోవడం చేత సభ సొగుసే పోయింది. “నియ్యోగి లేని సావిడి| అయ్యయ్యో వట్టి రోత, అది యెట్లన్నన్. వయ్యారి” - రామ : అట్టే పేలకు, ముహర్తానికి ముందే పుస్తె యెలా ముడెట్టావయ్యా? పూజా : సిద్ధాంతిగారు నక్షత్రాలు చూసి ఘడియలు గట్టి సరిగ్గా ముహూర్తం వేళకే పుస్తె కట్టించారండి. రామ : నాలుగడియల పొద్దుకాలేదే? పూజారి : నాలుగు ఘడియల రాత్రుందనగా కదండీ, శుభముహూర్తం? రామ : సిద్ధాంతి, ముహరం తెల్లవారి నాలుగు ఘడియలకని చెప్పాడే? పూజారి :పంచాంగం మార్చడానికి యవడిశక్యం బాబూ? తెల్లవారగట్ల నాలుగు ఘడియలకని, సిద్ధాంతి గారు మనవి జేసి వుంటారు. తాము పరాగ్గా విని వుందురు. రామ : పంచాంగానికేం యీ వెధవ పల్లిటూర్లో? సిద్ధాంతి ఆడింది ఆటా, పాడింది పాటా. యంత ద్రోహం చేశాడయ్యా సిద్ధాంతి! పూజారి :సిద్ధాంతి యంతో నొచ్చుకున్నాడు. తమరు రాలేదని బాబూ, యేమి ఆటంకంచాత వుండిపోయినారో అని అవుధాన్లు గారు తల్లడిల్లారు. తాషామర్ఫా విన్న తరవాత గదా, ఆయన మనస్సు స్వస్థపడ్డది. లుద్దా : నిజం మావఁగారు. పూజారి :యిక మధురవాణ్? అంటే, ఆ పందిట్లో నిశ్చేష్టురాలై పుత్తడి బొమ్మలాగ నిలుచుంది గాని బ్రాహ్మణ్యం యావన్మందీ గెడ్డం పట్టుకు యెంత బతిమాలుకున్నా, పాడింది కాదు. కొండిబొట్లు : అంతసేపూ హెడ్డు కనిష్టీబుగారితో మాట్లాడుతూ నిల్చుంది గాని, యేం? యింతమందిం ప్రార్థించినప్పుడు, ఓ కూనురాగం తీయ్యకూడదో? మరివక బ్రాహ్మడు : ఓరి కుంకాయా, పంతులుగారు సభలో లేందీ యలా పాడుతుందిరా? గురుజాడలు కన్యాశుల్కము - మలికూర్పు 306