పుట:Gurujadalu.pdf/350

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

మీనా : నాలుగడియల పొద్దుకి లగ్గవైంతే, యిప్పట్నించీ సరంజాం తొందరేవిఁటి అచ్చన్న మావా? సిద్ధాంతి :చదవేస్తే వున్న మతి పోయిందన్నాట్ట. నాలుగడియల రాత్రుందనగా శుభమూర్తం. మీనా : మా నాన్న యెప్పుడూ యిదే మచ్చు. యే మాటా నిజం యింట్లో ముండలతో చెప్పకపోతే యెలా యేడుస్తారు? నాన్నా ? నాన్నా! (లుబ్ధావధాన్లు ప్రవేశించును) లుబ్ధా : యెందుకా గావుకేకలు? మీనా : నాలుగడియల రాత్రుందనగానట మూర్తం. అచ్చన్న మావఁ అంటున్నారు. లుబ్ధా : యిదేవిఁటండోయి, నాలుగడియల పొద్దు కనుకున్నానే ముహూర్తం? సిద్ధాంతి: ముప్ఫై మూడు ఘడియల పొద్దు కనుకున్నారు కారో? మీ వెఱ్ఱులు చాలించి చప్పున కానియ్యండి మంగళాస్నానాలు. ఊళ్లో బ్రాహ్మలినందర్నీ పిలిచేశాను. లుబ్ధా: చంపారే! చలి! - అయితే రావఁప్పంతులుకూడా నాలుగ్ధడియల పొద్దుకి అనుకున్నాడే ముహూర్తం? ఆయనే వొచ్చి, పెద్దిపాలెంలో లౌక్యుల్ని నాలుగడియల పొద్దుకి రమ్మని పిలుస్తారేమో? సిద్ధాంతి: శతాంథాః కూపం ప్రవిశంతి. అమ్మీ, పిల్లకి స్నానం చేయించూ. మీనా : యిదుగో, నిమిషంలో చేయిస్తాను. సిద్ధాంతి :ఆడవాళ్లు నయం. పెళ్లి పందిట్లో సరంజాం చూసుకుంటాను. లుబ్ధా : పంతులు లేకుండా లగ్నం అయితే - సిద్ధాంతి : పంతులుకా, మీకా పెళ్ళి? జంకవోడక స్నానం కానీండి. (నిష్క్రమింతురు) ఆవ స్థలము : లుబ్ధావధాన్లు యింటి అరుగు మీద పసుపు బట్టలు కట్టుకుని, లుబ్ధావధాన్లు, స్త్రీ వేషముతో శిష్యుడు, కొందరు బ్రాహ్మలు కూర్చుని వుందురు (రామప్పంతులు, తాషామర్పా, కావిళ్ళూ, చాకర్లతో, ప్రవేశించి, అరుగు మీద చతికలబడి...) రామ : అబ్బ! ఎంత శ్రమ పడ్డానండి (నౌఖర్లతో) తాషామర్పా వూరుకోమను. బోయీలొహళ్లూ, బాజావాణ్ణిహళ్లూ, వూరు చేరేటప్పటికి కోలాహలం లావు చేస్తారు. కాళ్లు పీక్కు వచ్చాయయ్యా, వెధవ పెద్దిపాలెం యంతదూరం వుఁందీ! (తిరిగి చూసి) యిదేవిఁటీ గురుజాడలు కన్యాశుల్కము - మలికూర్పు 305