పుట:Gurujadalu.pdf/349

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

కరట : దివ్యస్థలం అయిన తరవాత యెవడేవఁంటే మనకేం పోయింది? లుబా : అయితే పంతులుతో చెబుదాం. కరట : యేవిఁటి మీ సత్యకాలం మావఁగారూ! యీ పెళ్లిలో యేదోవొక వొంటుబెట్టి, నాలుగు డబ్బులు ఆర్జించుకుందావఁని చూస్తూ వున్న పంతులూ, పోలిశెట్టి, ఏకరాత్ర వివాహానికి ఆమోదిస్తారా? పుస్తికట్టిందాకా ఆ మాట వాళ్లతో చెప్పకండి. లుబ్ధా : పంతులుతో చెప్పకపోతే యేం జట్టీ పెడతాడో? కరట : యేవిఁటి మీ భయం! అతగాడు మీకు యజమానా? జట్టీ, గిట్టీ పెడితే, పెణతూడ గొడతాను. లుబ్ధి : మీరు కాదుగాని, సిద్ధాంతిగారి చేతిలో రెండు రూపాయలు పడేస్తే, ఆ పూచీ అంతా ఆయన నెత్తిమీద వేసుకుంటాడు. ఆయన యదట పంతులు నోరు యెగియదు. కరట : పావంటిదానికి విరుగుడుంది. పంతులీకుండదా? (నిష్క్రమింతురు.) 3వ స్థలము : లుబ్ధావధాన్లు యింటి పెరడు (కరటక శాస్తుల్లు, మీనాక్షీ ప్రవేశింతురు) మీనాక్షి: మీ పిల్లని నా కడుపులో పెట్టుకోనా తాతయ్యా? కరట : కడుపుగదా అమ్మా? అంచేత పదే పదే చెబుతున్నాను. దానికి తల్లివైనా నువ్వే, తండ్రివైనా నువ్వే (దుఃఖమును అభినయించును) మీనాక్షి: విచారించకండి, తాతయ్యా. దానికి యే లోపం రానియ్యను. కరట : అమ్మా, నీకిమ్మని మా అమ్మి చేతికి ఓ పులిమొహురు యిచ్చాను. పుచ్చుకో. మీనాక్షి :యిస్తుంది. తొందరేవిఁటి, తాతయ్యా? దాం దగ్గర వుంటేనేం? నాదగ్గిర వుంటేనేం? (సిద్ధాంతి ప్రవేశించును) సిద్ధాంతి :యెంతసేపూ కూరలు తరగడం, భోజనాల సరంజాం జాగ్రత చెయ్యడం సందడే గాని, లగ్నానికి కావలసిన సరంజాం జాగ్రత్త చెయ్యడపు తొందరేవీఁ కానరాదు. నా శిష్యుడు ముంగిపోతులాగ పడున్నాడు. గురుజాడలు 304 కన్యాశుల్కము - మలికూర్పు