పుట:Gurujadalu.pdf/348

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

లుబా : యిదా మీరు నాకు చేసిన సాయం? పోనియ్యండి. ఆపజ్యెండుకైనా తగలెట్టండి. రామ : ఉపకారానికి పోతే నాదా నిష్టూరం? కోరి అడిగితే కొమ్మెక్కుతారు. యేం జెయను (కరటక శాస్త్రితో రహస్యంగా మాట్లాడి, తిరిగి వచ్చి లుబ్ధావధాన్లుతో) మావాఁ కృత్యాద్యవస్థ మీద వొప్పించాను. పిల్లదానికి సరుకు పెడితే గాని వల్ల లేదని భీష్మించుకు కూచున్నాడు. యేవఁంటావు?) లుబై : అదీ నా వల్ల కాదు. రామ : వూరుకోవయ్యా. అలాగే అందూ, మధురవాణి తాలూకు కంటె తెచ్చి ఆవేళకి పెట్టి, తరవాత తీసుకుపోతాను. లుబ్ధా : అదేదో మీరే చూసుకోండి. రామ : నేనే చూసుకుంటాను. ఖర్చు వెచ్చాలేవో మనవేఁ చేసుకుని, కొంచంలో డబడబలాడిం చేదాం. పోలిసెట్టిని సప్లైకి పెట్టకండి. పెద్దిపాలెం వెళ్లి లౌక్యుల్ని యెవరు పిలవడం? లుబై : మరి నాకెవరున్నారు. మీరే పిలవాలి. రామ : లౌక్యుల్ని పిలవడానికి వెళ్లినప్పుడు దుస్తుడాబుగా వుండాలి. దగలా, గిగలా తీయించి యెండవేయిస్తాను. (నిష్క్రమింతురు.) 9వ స్థలము : లుబ్ధావధాన్లు యిల్లు evat : అవును. మీరు చెప్పిన మాట బాగుంది. దివ్య స్థలాల్లో ఏకరాత్ర వివాహాచారం వుంది. కరట : పెద్ద పెద్ద ఉద్యోగస్థులు కూడా, యిప్పటి రోజులలో, వివాహాలు అలాగే చేస్తున్నారు. కోదండ రామస్వామివారు స్వయంవ్యక్తవూఁ, హనుమత్ర్పతిషా, అయినప్పుడు, దీవ్యస్థలం కాదని యెవడనగలడు?

ఆ మాట సత్యవేఁ గాని, యిది దివ్య స్థలంగా ఆలోచించి ఇదివరకు యెవళ్లూ యిక్కడ,

ఏకరాత్ర వివాహం చేసివుండలేదు మావఁగారూ. మనం చేస్తే యేవఁంటారో? గురుజాడలు 303 కన్యాశుల్కము - మలికూర్పు