పుట:Gurujadalu.pdf/353

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దనక్కరలేదు

లు : యెల్లుండి యేవాళకైనా రూపాయలు చెల్లించకపోతే దావా పడుతుందని, తొందరపడి పట్టుకు వెళ్లిపోయినారు. మళ్లీ వారంనాటికి వొస్తావ్కన్నారు. రామ : నన్ను మధ్యవర్తిని చేసి, నేను లేనిదీ, యీ వ్యవహారం యలా పైసలు చేశావు? నేను యంత యడ్వాన్సు వాడికి యిచ్చానో నీకు తెలుసునూ? అప్పుడే మావఁగారితో కలిసిపోయి నాకు టోపీ అల్లావూ? లుబ్దా మీరు చేసిన నిర్ణయ ప్రకారవేఁ, రూపాయలు చేతులో పడితేనే గాని, పుస్తే కట్టనివ్వనన్నాడు. యేం జెయ్యను? రామ : పుస్తె కట్టకపోతే నీ పుట్టె ములిగింది గాబోలు! నేనొచ్చేలోగా యేం వుప్పెనవొచ్చింది? వీడేదో పెద్ద దగా చేసి, నేనొస్తే, పట్టుగుంటానని రూపాయలు చేతులో పడేసుకుని వుడాయించాడు. వాడి పేరేవిఁటీ? పూజారి : ఆయన పేరు - మరే వచ్చి - అవుధాన్లు గారు శలవిస్తారు. లుబై : నాకు తెలియదు. రామ : అయ్యో అభాజనుడా! యిహ, వాడు, పంచాళీ మనిషి అనడానికి సందేహవేఁవిఁటి? లుబ్ధా : అతగాణ్ణి మీరే తీసుకొచ్చి దొడ్డవాడని చెప్పారు? అంచేతనే అతణ్ణి నేను నమ్మాను. రామ : నువ్వు నమ్మితే యెవడికి కావాలి? నమ్మకపోతే యెవడికి కావాలి? అతనికి నేను పెళ్లి ఖర్చుల కోసం బదులిచ్చిన నూరు రూపాయిలూ, అక్కడ పెట్టు. లుబై : యెవరికిచ్చారా ఆతడే అడగండి. నాతో చెప్పకండి. రామ : సరే, నీతో చెప్పను-నీతో యిక మాటే ఆణు-మరి నీ యింట్లో వక్క నిమిషం వుండను (లేచి నులుచుని) అంతా వినండయ్యా! యీ గుంటూరు శాస్త్రుల్లు పచ్చి దొంగ. లేకుంటే ఈ తెలివిహీనుడు యిచ్చిన రూపాయిలు సంధించుకుని, పేరైనా చెప్పకుండా పరారీ అవుతాడా? నా తాలూకు సొమ్ము కూడా పట్టుకు చపాయించాడు. వీడి వైఖరీ చూడగా, రెండో పెళ్లి పిల్లనో, సూద్రప్పిల్లనో, యీ తెలివిహీనుడికి అమ్మి, యెగేసినట్టు కనపడుతుంది. గనక, ఒరే! బారికీ, ఒరే! మంగలీ, హెడ్డు గారి దగ్గిరికెళ్ళి ఇద్దరు జవాన్లను తీస్కురా. వాడి వెంట దౌడా యింపిస్తాను. (పై మాటలు అంటూ వుండగా, సిద్ధాంతి ప్రవేశించి, రామప్పంతులు మాటలు ముగించి వెళ్లిపోబోతూ వుండగా రెక్కబట్టి నిలబెట్టును) సిద్ధాంతి : యెక్కడికి వెళతారు? కొంచం నిలబడండి. గురుజాడలు 308 కన్యాశుల్కము - మలికూర్పు