పుట:Gurujadalu.pdf/338

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

నెంబరు షరా - ఒకవేళ వైధవ్యం తటస్థించినా, మా వదినగారు జుత్తు పెంచుకునే

యడల, మీరేం జెయ్యగలరు; నేనేం జెయ్యగలను?"

మధు : చాల్చాలు; యీపాటి చాలించండి. గిరీశం గారు యేం తుంటరి?

రామ : యిప్పుడైనా వాడి నైజంనీకు బోధపడ్డదా? (చదువును) మూడవ షరా -యీ రోజుల్లో

స్త్రీ పునర్వివాహం గడబిడ లావుగా నున్నది. తమకు విశదమే. మీరు స్వర్గంబునకుం

బోయి ఇంద్రభోగంబనుభవించుచుండ నామెకు పునర్వివాహము చేసికొన బుద్ధి పొడమ

వచ్చును. అది మాత్రం నేను ఆపజాలనని స్పష్టముగా తెలియునది. ఏలననిన ? వద్దని

మందలించుటకు ఎదట పడితిమో, “మీయన్న స్వర్గంబున రంభతో పరమానందంబు

నొందుచునున్నారు కదా, నా గతేమి” అని యడిగినచో నేమి యుత్తర మీయువాడ?

మధు : మరి చాలించండి.

రామ : నీ యిష్టం వచ్చినప్పుడు చదివి, నీ యిష్టం వొచ్చినప్పుడు మానేస్తాననుకున్నావా

(చదువును)

నాల్గవ షరా

కొదువ అన్ని హంశములూ బహు బాగావున్నవి. తప్పకుండా యీ

సంబంధం మీరు చేసుకోవలిసిందే. మీ అత్తగారు సాక్షాత్తూ అరుంధతి వంటి వారు.

మనలో మనమాట, ఆమెకు యీ సంబంధం యెంత మాత్రమూ యిష్టము లేదు.

పుస్తకట్టే సమయమందు, మీ యింటి నూతులో పడి ప్రాణత్యాగం చేసుకుంటానని,

యిరుగు పొరుగమ్మలతో అంటున్నారు, గాని ఫర్వాలేదు. ఆ నాలుగు గడియలూ,

కాళ్లూ చేతులూ కట్టేదాం. మూడు ముళ్లూ పడ్డ తరవాత నూతులో పడితే పడ

నియ్యండి. మనసొమ్మేం బోయింది? పోలీసు వాళ్ల చిక్కు లేకుండా మాత్రం, వాళ్ల

కేమైనా పారేసి వాళ్లని కట్టుకోవలసివస్తుంది. యీ సంగతులు యావత్తూ మీ మేలుకోరి

వ్రాసితిని. యిక్కడ వారికి తెలియరాదు. మరిచిపోయినాను.

పిల్లజాతకం అత్యుత్కృ

ష్టంగా వుందట. ఆ బనాయింపు కూడా రామ -”

మధు : రామ?

రామ : అది ఆడవాళ్లు వినవలసిన మాట కాదు.

లుబ్ధా : అది కూడా మీరే బనాయించారంటా డేవిటండీ?

రామ : వాడి నోటికి సుధీ బద్ధం వుందీ?

డామేజీ పడితే గాని కట్టదు.

లుబ్ధి : కొంచం అయినా నిజం వుండకపోతుందా, అని నా భయం. అత్తగారికి యిష్టం

లేదని పోలిశెట్టి కూడా చెప్పాడు. యీ సంబంధానికి వెయివేలదణాలు; నాకొద్దుబాబూ.

కన్యాశుల్కము - మలికూర్పు

గురుజాడలు

293