పుట:Gurujadalu.pdf/339

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

మధు : బాగా అన్నారు. మీ సంబంధం మాకు యెంతమాత్రం వొద్దని, మీ మావఁగారి పేర వ్రాయండి. కాకితం కలం తేనా? లుబా : మావాఁ! మరి ముందూ వెనకా ఆలోచించక వెంటనే వుత్తరం రాసి పెట్టండీ. (నిలబడి మధురవాణి చెవిలో రహస్యము మాట్లాడును; మధురవాణి లుబ్ధావధాన్లు చెవిలో మాట్లాడును). రామ : మొహంమీద మొహం పెట్టి, యేవిఁటా గుసగుసలు? పైనుంచి పోస్టుజవాను - "లుబ్ధావుధాన్లు గారున్నారండీ. వుత్తరంవొచ్చింది” (మధురవాణి పైకి వెళ్లి వుత్తరము తెచ్చి లుబ్ధావధాన్లు చేతికి యిచ్చును. లుబ్ధావధాన్లు రామప్పఁతులు చేతికి యిచ్చును. ) లుబ్ధా : సులోచనాలు తేలేదు. మీరే చదవండి. రామ : (తనలో చదువుతూ) మరేవీఁ! చిక్కే వొదిలిపోయింది. మీ మావఁగారి దగ్గర్నించి. లుబా : యేవఁని? యేనుగులూ, లొటిపిటలూ తానంటాడా యేవిఁటండి? రామ : మీ సంబంధవేఁ అక్కర్లేదట. లుబ్దా : : యేవిఁటీ? యెంచేతనో? వాడికా అక్కర్లేదు? నాకా అక్కర్లేదు? తన పరువుకి నేం తగారుకానో? మధు : నిమిషంకిందట పెళ్లి వొద్దన్నారే? యిప్పుడు పెళ్లి తప్పిపోయిందని కోపవాఁ? లుబా: యింకా యేం కూస్తాడో చెప్పండి. రామ : మీరు పీసిరి గొట్లని యెవరో చెప్పారట. లుబ్దా : నేనా పీసిరి గొట్టుని? వొక్క పాటున పద్దెనిమిది బొందలు యే పీసిరి గొట్టు పోస్తాడు? యింత సొమ్ము యెన్నడైనా, ఒక్కసారి, అగ్నిహోత్రావుధాన్లు కళ్లతో చూశాడూ? సంసారం పొద్దుగా చేసుకుంటే పీసిరి గొట్టా? వాడిసొమ్ము వాడి నెత్తిని కొట్టిన తరవాత, నేనెలాంటి వాణ్ణి అయితే వాడికేం కావాలి? మధు : యెలాంటివాళ్లేం? బంగారంలా వున్నారు? రామ : మీరు ముసలివాళ్లనీ, మీకు క్షయరోగం వుందనీ కూడా, యెవరో చెప్పారట. లుబ్ధి : నేను ముసలివాణా వీడి సిగతరగా! యాభైయేళ్లకే ముసలిటండీ? కొంచెం దగ్గు వుండడవేఁ కాగట్టండి (దగ్గును) నివెడు ధనంపోసి పిల్లని కొనుక్కున్న తరవాత, మరిదాని ఘోషా, నా ఘోషా వాడి కెందుకయ్యా? డబ్బుచ్చుకున్న తరవాత చచ్చిన శవానికైనా కట్టకతీరదు. మాటాడ్రేం? కన్యాశుల్కము - మలికూర్పు గురుజాడలు 294