పుట:Gurujadalu.pdf/337

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

మధు : బావా, మరొకమాట ఆలోచించండి. పంతులకేం లాభం యేనుగులూ, లొటిపిటలూ, గాడిదలూ - (నవ్వును. ) రామ : మనిషివి కావా యేమిటి? గాడిదె మాట లేదంటూంటేనే? మధు : పోనియ్యండి - మీకెందుకు కోపం! గాడిదలు లేకపోతే కడంవ్వే ఆయెను. యివన్నీ మీ యింటి మీద పడి తింటే మా పంతులుగారికి యేం లాభం? చెప్పండి. ఒకవేళ రాతబు బేరం జరుగుతుంది గనక పోలిశెట్టికి లాభించవచ్చును. లుబై :

బాగా చెప్పావు - పోలిశెట్టి చేసినపనే!

రామ : చవగ్గా చేస్తాడని ఖర్చు వెచ్చం కోవఁటాడి మీద పెట్టావు. అనుభవించు. మధు :యిప్పుడు మించిపోయినదేమి? పెళ్లికూతుర్ని పంపిస్తే పది రూపాయలు ఖర్చుతో యిక్కడ ముడి పెట్టేస్తాం. మీరెవరూ రావద్దని, మీ మావఁగారి పేర వుత్తరం వ్రాయండి. లుబై :

మా ప్రశస్తమైన ఆలోచన చెప్పావు. మావఁగారూ, మధురం మా బుద్ధిమంతురాలు.

రామ : అదుగో! “మధురం గోధురం” అని మీరు అనకూడదు. “మధురవాణి” అనాలి. లుబ్ధా : పొరపాటు-గానీ తీరా మోసి వాళ్లు పెళ్లికూతుర్ని ఒక్కరైనీ పంపించేస్తే ? మధు : మరేం? మీ తీపు దిగదీసిందీ? పెళ్లి చేసుకొండి. లుబ్ధి :

నా ప్రాణం పోతే ఈ సంబంధం చేసుకోను. ఆ వుత్తరం కొసాకూ చదివితే అభివచేష్టలు

మీకే బోధపడతాయి. మధు : చదవడం మానేసి యేమిటి ఆలోచిస్తున్నారు? రామ : గిరీశం గాడిమీద పరు నష్టానికి డామేజీ దావా తేకమాన్ను - వాడి మొహంలాగే వుంది వుత్తరం. చదివేదేవిఁటి. లుబ్దా : మా వెధవ నా పరువు మాత్రం యేమైనా వుంచాడనా? అయినా తరవాయి చదవండి. రామ : (చదువును) తాజాకలం. చిన్నది బహులక్షణంగా వుంటుంది. గాని కొంచెం పెయ్య నాకుడు మాత్రం కద్దు. అద్దానిని మనవారు వైధవ్యహేతువ అండ్రు. యిది వట్టి సూప-సూపర్-స్టి-షన్ అనగా, తెలివి తక్కువ నమ్మకం. మనవంటి ప్రాజ్ఞులు లెక్కించవలసినది కాదు. షరా - దీనికి వక చిన్న బైరాగీ చిటికీ వున్నది. చిమ్మిటతో పెయ్య నాకుడు వెండ్రుకలూడబీకి, ఒక పౌ-పౌడర్ అనగా, గుండ కద్దు; ఆ గుండ ప్రామినచో మరల పెయ్యనాకుడు పుట్టనేరదు. ఈ లోగా దైవాత్తూ వైధవ్యంబే సంప్రాప్తించినచో, పదే పదే క్షారంబౌనుగావున పెయ్యనాకుడు బాధించనేరదు. రెండవ గురుజాడలు 292 కన్యాశుల్కము - మలికూర్పు