పుట:Gurujadalu.pdf/330

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

మధు : ఆడదాన్ని, నన్నా అడుగుతారు? రామ : ఆడదాని బుద్ధి సూక్ష్మం. కోర్టు వ్యవహారం అంటే చెప్పు. యెత్తుకి యెత్తు యింద్ర జాలంలా యెత్తుతానూ? చెయిముట్టు సరసవఁంటే మాత్రం నాకు కరచరణాలు ఆడవు. మధు : పెళ్లి నాలుగు రోజులూ, తలుపేసుకుని యింట్లో కూచోండి. రామ : ఆడదాని బుద్ధి సూక్ష్మవఁని చెప్పాను కానూ? మా మంచి ఆలోచన చెప్పావు. మధు : గాని, నాకొక భయం కలుగుతూంది. నిశిరాత్రి వేళ పైగొళ్ళెం బిగించి, కొంపకి అగ్గిపెడతాడేమో? రామ : చచ్చావేఁ! వాడు కొంపలు ముట్టించే కొరివి ఔను. మరి యేవిఁగతి? మధు : గతిచూపిస్తే యేమిటి మెప్పు? రామ : "నువ్వు సాక్షాత్తూ నన్ను కాపాడిన పరదేవతవి” అంటాను. మధు : (ముక్కుమీద వేలుంచి) అలాంటి మాట అనకూడదు. తప్పు! రామ : మంచి సలహా అంటూ చెప్పావంటే, నాలుగు కాసులిస్తాను. మధు : డబ్బడగలేదే? మెప్పడిగాను. నేను నా ప్రాణంతో సమానులైన మిమ్మల్ని కాపాడుకోవడం, యెవరికో ఉపకారం? రామ : మెచ్చి యిస్తానన్నా తప్పేనా? మధు : తప్పుకాదో? వేశ్యకాగానే దయా దాక్షిణ్యాలు వుండవో? రామ : తప్పొచ్చింది. లెంపలు వాయించుకుంటాను, చెప్పు. మధు : పెళ్లి వంటలకి పూటకూళ్లమ్మని కుదర్చండి. రామ : ఛబాష్! యేమి విలవైన సలహా చెప్పావు! యేదీ చిన్న ముద్దు (ముద్దు పెట్టుకోబోయి, ఆగి) గాని గిరీశంగాడు నన్నూ దాన్ని కూడా కలియగట్టి తంతాడేమో? మధు : ఆ భయం మీకక్కర లేదు. పూటకూళ్లమ్మ కనపడ్డదంటే, గిరీశం గారు పుంజాలు తెంపుకు పరుగెత్తుతారు, ఆమె నోరు మహాఁ చెడ్డది. రామ : అవును, నోరే కాదు, చెయ్యి కూడా చెడ్డదే. దాం దెబ్బనీకేం తెలుసును. గాని, మా దొడ్డ సలహా చెప్పావు. యేదీ ముద్దు (ముద్దు పెట్టుకొనును.) ముద్దు బెట్టుకుంటుండగా లుబ్ధావధాన్లు ఒక వుత్తరము చేతబట్టుకుని ప్రవేశించును.) లుబ్ధా : యేమిటీ అభావ చేష్టలూ! గురుజాడలు 285 కన్యాశుల్కము - మలికూర్పు