పుట:Gurujadalu.pdf/319

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

యంతమాత్రం నడవరు. మనం శాస్త్రమూ, సవబులూ చూపిస్తే యావఁంటారు? యీ గుంట వెధవలు చెప్పడం మనం విండవూనా అని కజ్జుచ్చుకుంటారు. నా మాట కేవించప్పకండి, నాదీ యినుంలాంటి శరీరం-కొడితే కట్టె విరిగిపోవాలి గాని చెక్కు చదరదు. నా ప్రియ శిష్యుడికైతేనో? మీ అందరివీ మెత్తని మృదువైన శరీరాలు అవుట చాత యెవిఁకలు విరిగిపోతాయి. గనక యీ మాటలు మన్లో మనం అనుకోవలసినవే గాని మరోళ్ళతో ప్రాణం పోయినా అనవలసినవి కావు. యావఁంటారు? బుచ్చమ్మ : అవును. గిరీశం: అవునంటే చాలదు. యవరితోనూ యీ మాటలు చెప్పనని మీరంటేనే గాని, నా మనసులో మాటలు నాలుగూ యెలా చప్పడం? బుచ్చమ్మ : యవరితోనూ చప్పను. గిరీశం: వొట్టేసుకోవాలి. బుచ్చమ్మ :యావఁని వొట్టేసుకునేది? గిరీశం: యావఁనా? మీరు యవరితోటైనా చెబితే నా బుజ్జి పగిలిపోవాలని వొట్టేసుకొండి. బుచ్చమ్మ :

అహఁ! అలా వొట్టేసుకోను! మీ బుజ్జి చల్లగా వుండాలి. చెబితే నాబుజ్జె పగిలిపోవాలని

వొట్టేసుకున్నాను. గిరీశం: అందుకు నే వొప్పుతానా యేవిఁటి? నా బుజ్జి పగిలింతరవాత మీబుజ్జి జోలికి యవడైనా రావాలి గాని, మీ ప్రాణానికి నా ప్రాణం అడ్డు వెయ్యనా? బుచ్చమ్మ : మా అమ్మని బతికించారు కారా? మీరు ఆలాంటి వారే. గిరీశం: ఆ మాట మీరే అన్నారు గనక, వినండి - చెప్తాను. నేను పెళ్ళాడి పెళ్లాం బిడ్డలూ నాకుంటే, వాళ్లని తల్చుకున్న తరవాత ప్రాణానికి తెగించి మీ అమ్మని తీయ్యడానికి నూతులోకి గెంత గలిగివుందునా? యీ జన్మవఁంతా లోకోపకారం కింద వినియోగ పర్చు కుందావఁని నిశ్చయించుకుని యిదివరదాకా ఏకాకినైవుంటిని. సత్యమే. మీలాంటి నా మేలుకోరిన వాళ్ళు "పెళ్లి చేసుకో” అంటే ఆ మాట తోసేయడం కష్టమే; గాని ఒక మాట మాత్రం జవాబు న్యాయంగా చప్పండి. ఒక్కళ్లకి ఉపకారం చేయడం గొప్పా? అందరికీ ఉపకారం చెయడం గొప్పా? బుచ్చమ్మ : అందరికి చెయ్యడవేఁ గొప్పనుకుంటాను. గిరీశం: సరే! ఆ మాట మీద నిలవండి. పెళ్లాడి, ఆలూ బిడ్డలికి, ముచ్చకాయ ముగ్గురికి ఉపకారం చేయడం కంటే లోకోపకారం కింద యీ ప్రాణం వినియోగపర్చడం పుణ్యం కాదా? చచ్చే కాలానికి స్వర్గం యెదురుగుండా వొస్తుంది? కన్యాశుల్కము - మలికూర్పు గురుజాడలు 274