పుట:Gurujadalu.pdf/320

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

బుచ్చమ్మ : లోకానికి యేం ఉపకారం చాస్తారు? గిరీశం: అలా అడగండి. సోషల్ రిఫారమ్. సోషల్ రిఫారమ్ అంటే సంఘ సంస్కారం. అసలు యింగిలీషు మాట యంత అర్థమౌతుందో, మీకు, దాని తర్జుమా కూడా అంతే అర్థం అవుతుంది. విప్పి చెప్పాలంటే ఒక సిమిలీ, అనగా ఉపమానం చెప్పి మీకు బోధపరుస్తాను. లోకం తప్పు తోవలో వెళ్లుతూంటే ఆ తోవలోంచి మళ్లించి మంచితోవలో పెట్టడమనేది సోషల్ రిఫారమ్. బుచ్చమ్మ : యేమిటా తప్పుతోవ ? గిరీశం : జారూ బురదాగట్లూ గతకలూ వున్న తోవ యలా వుంటుందో యిప్పుడు మనవాళ్ల ఆచారాలు అలా వున్నాయి; ఆ తోవలోంచి బండి తప్పించి మంచి దిమ్మిసాకొట్టిన హైరోడ్డులోకి మళ్లించాలి. ఆ బండికి రెండు చక్రాలు. ఒకటి విధవా వివాహం, రెండు నాచిక్వొశ్చన్, అనగా సానివాళ్లని హతవాఁర్చడమున్నూ ఈ రెండే రాజమార్గాలు. బుచ్చమ్మ : మనవాళ్ల దురాచారాలేవిఁటో నాకు బోధపడలేదు. గిరీశం: ఐతే చెబుతాను వినండి. ముసలాళ్లకి చిన్న పిల్లల్నిచ్చి పెళ్లి చెయ్యడం ఒకటి. డబ్బుకి పిల్లల్ని అమ్ముకోవడం ఒకటి. అవునంటారా కాదంటారా? బుచ్చమ్మ : అవును. గిరీశం: ఆ ముసలాళ్లు ఛస్తే కష్టం సుఖం యరగని పసి పిల్లలు వెధవలు అవుతారు. ఉప్పూ, పులుసూ తినడం చాత యేమీ యరగని పసిపిల్లలు పూర్నయవ్వనం వొచ్చిన తరవాత మనసు పట్టలేకపోతే వాళ్లదా తప్పు? “వెధవ వివాహం కూడదూ, గిధవ వివాహం హ” అని ఓర్వలేని మాటలు చెబుతూ, డబ్బు కాసించి, ముసలి పెళ్లిళ్లు చేసే మూర్ఖుల్గా తప్పు? వూరుకుంటారేం? బుచ్చమ్మ : నాకు తెలియదు. గిరీశం: అవుఁను మరి మీరేవఁనగర్రు? తల్లినీ తండ్రినీ యేవఁనుకున్నా మనసులో అనుకుని జీర్ణించుకోవాలి గాని, మీలాంటి మంచివాళ్లు పైకంటారా? నాలాంటి వాణ్ణి, యేవఁ ండీ మావఁగారూ, పిల్లల్ని రూపవంతుడూ, యవ్వనవంతుడూ, బుద్ధి మంతుడూ అయ్ని కుర్రవాడికి యిమ్మని శాస్త్రంలో వుంది గదా, శాస్త్రానికి విరుద్ధంగా యెందుచాత డబ్బుక్కక్కూర్తిపడి ముసలాళ్లకి కట్టబెడుతున్నారయ్యా? శాస్త్రంలో "వెధవలికి పెళ్ళి చెయ్యవలసినది, చెయ్యవలసినది” అని శాశించి చెప్పి వుండగా యెందుకు చెయ్యరయ్యా అని అడిగితినట్టాయనా, అర్ధచంద్ర ప్రయోగం చేసి అవతలికి గెంటుతారు. అంచాత గురుజాడలు 275 కన్యాశుల్కము - మలికూర్పు