పుట:Gurujadalu.pdf/318

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

వెంక : నావంటి కుర్రాళ్లకి చదువు చెప్పడం (నిమ్మళంగా) చుట్ట నేర్పడం. (గట్టిగా) నాచ్చికొశ్చన్ అనగా సానివాళ్లనందర్ని దేశంలోంచి వెళ్లగొట్టడం ఒహటి. నేషనల్ కాంగ్రెస్-అనగా దీవానొరీ చలాయించడం ఒహటి. యిప్పుడు తెలిసిందా? బుచ్చమ్మ : ఉద్యోగం చెయ్యరన్నావే? దీవాన్దరీ యే రాజు దగ్గిర్రా? వెంక : యే రాజుదగ్గిరా? ఆడదానివి నీ కెందుకూ యీ భోగట్టా అంతాను? బుచ్చమ్మ : నువు కూడా లోకం మరమ్మత్తు చాస్తావుప్రా? వెంక : ఓ! బుచ్చమ్మ : ఐతే వెధవముండని కూడా పెళ్లాడతావురా? వెంక : నాన్న తన్నకుండా వుంటే తప్పకుండా పెళ్ళాడతాను; గానీ బోడిగుండు చేస్తే మాత్రం నాకకర్లేదు. (గిరీశం ప్రవేశించి). గిరీశం : వదినా యీ చెట్టుకింద నిలబడితే మీరు వనలక్ష్మిలా వున్నారు (బుచ్చమ్మ వైపు తేరి చూసును). బుచ్చమ్మ : విన్నారా? తమ్ముడు వెధవని పెళ్లాడతావ్ల! గిరీశం : నా ప్రియశిష్యుడూ, మీకు ప్రియసోదరుడూ అయిన వెంకటేశం విధవా వివాహవేఁ చేసుకుంటే, మేం యావన్మందివిఁన్నీ బ్రహ్మరథం పట్టవా? బుచ్చమ్మ : గురువులుగదా ముందు మీరెందుకు చేసుకోరు? గిరీశం: అడగవలిసినమాట అడిగారు. చెప్తాను వినండి. మీరడిగినతరవాత చెప్పకపోవడం తప్పని చెబుతున్నాను గాని, యీ మాటలు చెప్పవలసినవి కావు. యేవఁంటారా? నా గొప్ప నే చెప్పుకోకూడదు గదా? అదొహటి. అంతకంటే ప్రమాదమైన మాట మరోటుంది. చూశారా వొదినా! - మొదట్నించీ విధవా వివాహం కూడదు కూడదు అని తప్పు అభిప్రాయంలో పడిపోయివున్న అత్తగారూ, మావఁగారూలాంటి పెద్ద వాళ్లకి యెన్ని శాస్త్రాలూ సవబులూ మనం చెప్పినా, వాళ్లకి నెత్తికెక్కవు. యిలాంటి మాటలు వాళ్లతో మనం చెప్పినట్టాయనా కజ్జుచ్చుకుంటారు. మావఁగారు వేదం మట్టుకే చదువుకున్నారు గానీ నేను శాస్త్రాలు అన్నీ చదువుకున్నాను. అబ్బో, నేను మనశాస్త్రాల్లో వు, లుణ్ణి. శాస్త్రకారుడు యేవఁన్నాడూ? “బాలాదపి సుభాషితం” అన్నాడు. అనగా మంచిమాట చంటి పిల్లడు చెప్పినా విని ఆ ప్రకారం చెయ్యండయ్యా అన్నాడు. అయితే మన పెద్దవాళ్ళు శాస్త్రంలో చెప్పిన ప్రకారం నడుస్తారూ? గురుజాడలు కన్యాశుల్కము - మలికూర్పు 273