పుట:Gurujadalu.pdf/309

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

రామ : వజ్రవేఁగానండి, పట్టవాసపు అలవాటు చాత పదిమందితో మాట్లాడితే గాని దానికి వూసుబోదు. కరట : ఆ మాత్రం స్వేచ్ఛ యివ్వడమే మంచిదండి; ఆడదాన్నట్టే లెకాయించకూడదండి? రామ : రొకాయిస్తే యెంజేస్తుందేవిఁటండి? కరట : యిలాంటి మానం గల మనిషైతే నూతులో గోతులో పడుతుందండి. రామ : అలాగనా అండి? కరట : అందుకు సందేహమేమిటండి? నాజూకైన మనస్సు గల స్త్రీని మల్లెపువ్వులాగ వాడు కోవాలండి. రామ : ఆ నాజూకులూ గీజూకులూ మీకేం తెలుసునండి? కరట : పుస్తకాల్లో చదువుకున్న ముక్కలు. నాయకుడు నిరాకరిస్తే నాయిక వొచ్చిన్నీ యేవే, ఉద్యానాల్లో వుండుకున్నషువంటి లతలతో వురిపోసుకుంచుందండి. మహాకవుల నాటకాల్లో ఆప్లాగే జరిగినట్లు రాశారండి. రామ : మరెవళ్లతో మాట్లాడినా తప్పులేదు గాని, హెడ్డు కనిష్టబుతో మాత్రం మాట్లాడవద్దని బుద్ధి చప్పండి. మీరు తండ్రిలాంటి వారు గదా? కరట : ప్పు! అంత అదృష్టవాఁ అండి! అట్లాంటి పిల్లే నాకు వుంటే, మూడు నాలుగు వేలకమ్ము కుని రుణాలూ పణాలూ లేకుండా కాలక్షేపం చేసి వుందును. దీన్నయినా నాలుగు దిక్కులా అమ్మజూపితే రెండు మూడు వేలు యిదివరకే చేతిలో పడివుండునండి. మేనరికం చెయ్యాలని దీంతల్లి భీష్మించుక్కూచోబట్టి యీదురవస్థ మాకొచ్చింది. అంచాతనే యింట్లో చప్పకుండా యీ పిల్లని వెంట తీసుకొచ్చి యీ దేశంలో పెళ్లికి చూపుతున్నాను. రామ : నా సహాయ లోపం వుండబోదు. కరట : ఐతే కార్యవఁయిందే! రామ : యెదీ పిల్లా యిలారా, చెయి చూపించూ. (శిష్యుడు భయం నటించి వెనక్కి తక్కును) కరట : చూపించమ్మా, భయం లెచ్చూపించు (కరటక శాస్త్రుల్లు శిష్యుణ్ణి రామప్పంతులు దగ్గిరికి తోయును. రామప్పంతులు చెయ్యిపట్టుకుని అరిచెయ్యి చూచు చుండును. శిష్యుడు చెయ్యి లాగుకొంటూన్నట్టు నటించును. మధురవాణి సిరాబుడ్డీ, కలం, కాకితం పట్టు కొని రామప్పంతులు వెనక నిలుచుండును) గురుజాడలు కన్యాశుల్కము - మలికూర్పు 264