పుట:Gurujadalu.pdf/308

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

కరట : దారి ఖర్చు కోసం తెచ్చిన రూపాయలు మీకు దాఖలు చేశాను. మరిబుర్ర గొరిగిం చుకుందా వఁంటే దమ్మిడీ లేదు. కోర్టంట తిరగడానికయినా చేతిలో ఓ డబ్బు సొమ్ముండాలి గదా? యిదొహర్రే టొంపలా నాతో వుంటే యలాగండి కోర్టంట తిర గడం? తమ లౌక్యానికి అసాధ్యవఁన్నది వుంటుందంటే నే నమ్మజాలను. యలాగయినా కుదిర్న సంబంధం తప్పించి, మా సంబంధం కుదిర్చి, నాకు యిచ్చే సొమ్ములో పదోవంతు తాము అంగీకరించి మిగిలింది నాకు దయచెయ్యండి. దీన్ని మొగుడింట అప్పజెప్పి ఆ పైన యీ గ్రంథం యేదోకొస చూసిందాకా తమర్ని అంటగాగి వుంటాను. రామ : పదోవొంతు పనికిరాదు. మా బేరం యెప్పుడూ సగానికి సగం. కరట : సంగోరు మీకిస్తే మరి నేను రుణాలేం తీర్చుకోను? రామ : రుణాలీర్చుకో అఖర్లేకుండా గ్రంథం జరిగిస్తాం కదూ? అప్పుడే మీ చేతులో రూపాయలు పడడానికి శిద్ధంగా ఉన్నట్లు మాట్లాడుతారేవిఁటి? నేను యంత శ్రమపడ్డ పైని పతకం తీరగాలి? అది ఆలోచించారా? కరట : తాము అలా అంటే నేనేం మనివి చెయ్నండి? రక్తం మాంసం అమ్ముకుంటూన్నప్పుడు ఆ కానీ కూడయినా సంతుష్టిగా దొరకడం న్యాయం గదండి? వ్యవహారాల తొట్రుబాటు చాతనూ పిల్ల కట్టు దప్పి వుండడం చాతనూ, తొందరబడుతున్నాను గానండి, కొంచెం వ్యవధి వుంటే రెండు వేలకి పైగా అమ్ముకుందునండి. రామ : "అయితే గియితేలు” అనుకున్న లాభం లేదని చెప్పాను కానా? ఐదో వొంతుకు యేవంటారు? కరట : యీ పాపపు సొమ్ముకే తమరు ఆశించాలా అండి? రామ : పాపపు సొమ్ము మాదగ్గిరికిరాగానే పవిత్రవైఁ పోతుంది. ఒహళ్ల కివ్వడం కోసవేఁ గాని నాక్కావాలా యేవిఁటి? కరట : ఐతే కానియ్యండి. రామ : యిక నా ప్రయోజకత్వం చూడండి. మధురం! మధురం! కాకితం, కలం, సిరాబుడ్డి తీసుకురా. మామోలు సిరాబుడ్డి కాక గూట్లోది పెద్ద సిరాబుడ్డి తే. మధు : (అవతల నుంచి) నాకంటె మధురం కంటబడ్డ తరువాత నేనెందుకు? రామ : ఆడవాళ్లకి అనుమానం లావండి. వింటున్నారా? అదో ముచ్చట! కరట : కేవలం వజ్రాన్ని సంపాదించారు! గురుజాడలు 263 కన్యాశుల్కము - మలికూర్పు