పుట:Gurujadalu.pdf/307

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

దీక్షితులు గారికి పదహారు వందలకి అమ్మ నిశ్చయించుకొని తీరా వొచ్చేసరికి యిప్పట్లో రూపాయలివ్వలేం, పెళ్లయిన నెల రోజుల్లో యిస్తావఁన్నారండి. అందుచేత అది వొదులుకొని లుబ్ధావుధాన్లు గారు వివాహ ప్రయత్నంలో వున్నారని విని తమ దర్శనానికి వొచ్చానండి. యిది గాని తాము సమకూరుస్తే పది వరహాల సొమ్ము దాఖలు చేసుకుంటాను. రామ : నేను నలభై యాభై రూపాయల వ్యవహారాల్లో జొరబడే వాణ్ణి కాను. కరట : తాము చేసే సదుపాయాన్ని బట్టి యెంతయినా దాఖలు చేసేవాళ్లేనండి. నా రుణాలు పదహారు వందలుంటాయండి. ఆపైని యెవొచ్చినా తాము దాఖలు చేసుకొండి. రామ : "ఐతే, గియే” బేరాలు మాకవసరం లేదు. అగ్నిహోత్రావుధాన్లకి పద్దెనిమిది వొందలిస్తున్నాడు గదా, అందుకు సగానికి సగం తగ్గితేనే గాని అవుధాన్లు ఆ సంబంధం మాని మీ సంబంధం చేసుకోడు. అందులో మీ రుణాలు తీరేదేవిఁటి? నాకిచ్చేదేవిఁ టి? యేవైఁ తేనేవి? ఆ వ్యవహారం యలాగా మించిపోయింది. పది రోజులకిందటొస్తే కాకుపరుస్తును. ఆ సంబంధం భోగట్టా మొదట నేనే తెచ్చాను. నా చేతులోంచి ఆ వ్యవహారం పోలిశెట్టి లాగేశాడు. కృత్యాద్యవస్థ మీద మధురవాణి మేజువాణీకి వాణోప్పించే సరికి నా తాతలు దిగొచ్చారు. మరి వక ఉపాయం చెబుతాను వినండి. మీకు మయినరు కొమాళ్లున్నారా? కరట : చిన్నవాడికి మయినారిటీ దాటి మూడేళ్లయిందండి. రామ : అయితే యిహలేందేవిటి? ఆ కుఱ్ఱవాడు మయినరని వాదిద్దాం. కరట : సాక్ష్యం యలావొస్తుందండి? రామ : ఓహో హో! మీకు యేమీ తెలియదే! యిలాంటి వ్యవహారాలు నా తలమీద యెన్ని వెంట్రుకలున్నాయో అన్ని మోసేశాం. విన్నారా? ఉర్లాం బసవ రాజుగారి సంభావన్ల రేటే సాక్ష్యాలక్కూడా గేజటార్టర్ చేశాం. కుండనాలు వేసుకున్నవారికి ఓ రూపాయి జాఫా. కరట జాతకం వుంది గదా యేం సాధనం? రామ : కాకితవైఁతే అగ్గిపుల్లతో ఫైసల్. తాటాకైతే నీళ్లపొయ్యి! కొత్త జాతకం బనాయించడం అయిదు నిమిషాలు పని. మా సిద్ధాంతి మట్టుకు నాలుక్కాలాలు చల్లగా వుండాలి. నా దగ్గిర పాత తాటాకులు ఆలేఖాలు అటక నిండా వున్నాయి. ముప్ఫైయేళ్ళ నాటి కాకితాలున్నాయి. రకరకాల సిరాలున్నాయి. ఒక నూఱూపాయిలు నాకు ఫీజు కింద యిచ్చి ఖర్చులు పెట్టుకొండి. గ్రంథం నడిపిస్తాను. కన్యాశుల్కము - మలికూర్పు

గురుజాడలు 262