పుట:Gurujadalu.pdf/306

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

భార్యా కరట : ఆమె మీ కారండీ? సంసారికన్నా మర్యాదగా వుంది యీ వేశ్య! మీది యేవఁ దృష్టం! రామ : యెంపిక, యెంపికలో వుందండి. మీ రాచకార్యం చెప్పారు కారు. కరట : లుబ్ధావురాన్లు గారికీ తమకీ చాలా స్నేహవఁని విన్నాను. ఆయన తమమాట అడుగుదాటరట? రామ : ఆ గాడిద కొడుక్కి ఒకరితో స్నేహం యేమిటండీ? వాడి ప్రాణానికి డబ్బుకీ లంక. డబ్బుకీ వాడికే స్నేహం గాని మరి యవరితోనూ స్నేహం లేదు. అయితే వాడికి వ్యవహార జ్ఞానం లాకపోవడం చాతా, కోర్టటే భయంచాతా నా సలహాలాక బతకలేడు. వాడే అన్నమాటేవిఁటి, యీ తాలూకాలో సివిలు మేజస్ట్రేట్లు యెక్కఁడొచ్చినా రామప్పంతులు పప్పులేని పులగం వుండదు. కరట : ఆ మాట వినే తాము నియ్యోగ ప్రభువులు, మంత్రబలం చాత చక్రం అడ్డేస్తారని తమర్ని వెతుక్కొచ్చాను. మా పింతల్లి కొడుకు బియ్యే బియ్యల్ పాసయినాడండి. డిప్ట్ కలెక్టరీ చేస్తున్నాడు. బంధువులకి అతని వల్ల గడ్డిపరకంత సాయం లేదు గదా? మీది మిక్కిలి కూరానారా యవళ్లయినా గృహస్థులు గృహస్థు మర్యాదకి పంపించి, తల్లయినా, పెళ్ళాం అయినా అవి పుచ్చుకుంటే, తిరగగొట్టిందాకా అభోజనం కూచుంటాడు! పెట్టడానికి పుచ్చుకోవడానికి నియ్యోగ ప్రభువులు, తమకి చెల్లింది కాని, మా వాళ్ల ఉద్యోగాలు మంటి గడ్డ ఉద్యోగాలండి. “ఇయ్యా ఇప్పించంగల అయ్యలకే గాని మీసమన్యులకేలా రొయ్యకి లేవా బారెడు” అని కవీశ్వరుడన్నాడు. రామ : యీ యింగిలీషు చదువులు లావైన కొద్దీ వైదీకులే అన్న మాటేవిఁటి అడ్డవైన జాతుల వాళ్లకీ ఉద్యోగాలవుతున్నాయి గాని యంత చదువుకున్నా మీ వైదీకప్పంతుళ్ళ వారికి మా చాకచక్యాలబ్బుతాయండీ? మా లౌక్యం మాతో స్వతహాగా పుట్టినది, మీరు తెచ్చి పెట్టుకున్నది. యెరువు సరుకు, యెరువు సరుకే, విన్నారా? మీ వాళ్ళు లంచాలు పుచ్చుకోవడం చాతకాక, పతివ్రతలమని వాషం వేస్తారు. కరట : అదే పతకవైఁతే అది అమ్ముకు బతకనాఁ అన్నట్టు మా వాళ్లకే చాతయితే నాకు యీ అవస్థీవండి? మా వాడు పదిమంది పార్టీలతో చెబితే పదిరాళ్ల సొమ్ము దొరుకును. యీ చిక్కులు లాకపోవును రామ : యెవింటా చీక్కులు? కరట : రుణబాధ చాలా లావుగా వుందండి. రేపటి పున్నంలోగా ఒక దస్తావేజు తాలూకు రూపాయలు చెల్లక పోతే దావా పడిపోతుందండి. యీ పిల్లని నల్లబిల్లిలో వెంకట కన్యాశుల్కము - మలికూర్పు గురుజాడలు 261