పుట:Gurujadalu.pdf/302

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

మధు : మా పంతులుకేనా పెళ్లి? కరట : “ఏకా నారీ సుందరీ వా దరీవా” అన్నాడు. త్రిలోక సుందరివి నువ్వు దొరికిం తరవాత నీ పంతులు గారికి యింకా పెళ్లెందుకు? మధు : ఐతే మరెవరికి పెళ్లి చెడ్డం? నాకాయేవిఁటి? అలాగైతే, సైయేఁ! మొగవేషం వేసుకొని, పెళ్లి పీటల మీద కూర్చుంటాను. యిలాంటి పెళ్లాం దొరకడవెఁలాగ? జగత్ప్రసిద్ధులైన కరటకశాస్తులు గారి అల్లుణ్ణి కావడం యెలాగ? దివ్యసుందర విగ్రహవఁని పొగడగానే నా బుజాలు పొంగుతాయనుకున్నారు కాబోలు? యీ పిల్ల దగ్గిర నా బోట్లు దివిఁటీ ముందర దీపాలు. ఆడది మెచ్చిందే అందం! మొగాడి కన్ను మసక. మీకేం తెలుసును? మరి నా పెళ్లాన్ని నాకిచ్చేసి మీ తోవని మీరు వెళ్లండి (శిష్యుడి చెయి పట్టి లాగును.) శిష్యు : చూశావురా నాన్నా యలా పట్టుకుందో? మధు : (ఆచుకోలేకుండా నవ్వుతూ) శాబాసు! యిదేనా పెద్దమనిషి తరహా! యిరుగు పొరుగమ్మ లేవఁంటారో మొగుడు పిలిస్తే వెళ్లకుంటేను? శిష్యు : కొడుతుంది కాబోల్రా నాన్నా, యింటి కెళ్ళిపోదాం, రా! మధు : యేం నంగనాచివే? తరవాత పెళ్లి చేసుకుంటాను. అందాకా ముద్య్యి (ముద్దెట్టు కొనును) కరట : నేరని పిల్లని చడగొడుతున్నావు. మధు : నాలాంటి వాళ్లకి నూరు మందికి నేర్పి చెడగొట్టగలడు. యవరి శిష్యుడు? యీ కన్న పిల్ల నోరు కొంచం చుట్ట వాసన కొడుతూంది! కరట : అంచాతే కాబోలు డబ్బీలో చుట్టలు తరుచు మాయమౌఁతూంటాయి. మధురవాణీ! దేవుఁణాకు నిన్ను చూపించాడు. పంతులేని సమయం కనిపెట్టి వొచ్చాను; మళ్లీ అతడొచ్చే లోగా నా మాటలు నాలుగూ విని మాకు వొచ్చిన చిక్కు తప్పించు. మధు : మీకొచ్చిన చిక్కేవిఁటి? నేం చెయలిగిన సహాయ వేఁవిఁటి? కరట : చిక్కన్నా చిక్కు కాదు. విను, యీ యీళ్ళో గిరీశం పెత్తల్లి కొడుకు లుబ్ధావుధాన్లని ఓ ముసలాడున్నాడు; వాడికి మా మేనగోడల్నివ్వడానికి మా బావ నిశ్చయించాడు. యీ సంబంధం చేస్తే నా చెల్లెలు నూతులో పడతానని వొట్టేసుకుంది, యేం వుపాయం చెస్తావో, దాని ప్రాణం కాపాడాలి. మధు : యీ పిల్లనీ అంతకి తక్కువ సొమ్ముకి అమ్మితే, లుబ్ధావధాన్లు చంకలు గుద్దుకుని చేసుకుంటాడు. అతని దాకా యెందుకు నేనే కొనుక్కుంటాను. కన్యాశుల్కము - మలికూర్పు గురుజాడలు 257