పుట:Gurujadalu.pdf/301

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

కరట : నా కొమార్త. మధు : నాటకవఁల్లా చెడి పొగటి వేషాల్లో దిగిందా? పెట్టి పుట్టారుగదా యేల యీ అవస్థ? కరట : నీ దయవల్ల దేవుడిచ్చిన స్థితికేం లోపం రాలేదు. నిన్ను చూదావఁని వొచ్చాను. మధు : యిన్నాళ్లకైనా యీ దీనురాలు మీకు జ్ఞాపకం రావడం అదెంత గాదు? కరట : నీలాంటి మనిషి మళ్లీ వుందా? నిన్ను చూడ్డం బ్రహ్మానందం కాదా? నీ దగ్గరికి రావడం చేదనా యిన్నాళ్ళూ రాలేదనుకున్నావు? డిప్ట్ కలక్టరుగారి కుమాగ్రత్నం గారు నిన్ను చేపట్టారని తండ్రికి తెలిసింతరవాత, నేను గానీ నీ యింటికి వొస్తే వీక ఉత్తరించేస్తాడేమో అనే భయం చాత కొంచం యడబెట్టి యితడికి యెప్పుడు బదిలీ అవుతుంది, మా మధురవాణ్ణి యెప్పుడు చూస్తాను అని దేవుణ్ణి సదా ప్రార్థిస్తూ వుంటిని, నువ్విక్కడెన్నాళ్లాయి వున్నావు? మధు : డిప్ట్ కలక్టరు గారి కుమాగ్రత్నం గార్ని, తండ్రి, చదువు పేరు పెట్టి చన్నపట్టం తగిలిన రెండు నెల్లదాకా ఆయన నాస్తుడు గిరీశం గారి ద్వారా డబ్బు పంపించాడు. ఆ తరవాత మొన్నటి దాకా గిరీశం గారు నన్ను వుంచారు గానీ, డబ్బుకి యటాముటీగా వుండేది. నా యింటికి వొచ్చిన వాడల్లా తన కొడుక్కి దోస్తీ అయివుంటాడని డిప్ట్ కలక్టరు అనుమానిస్తాడేమో అని పేరుగల వాడెవడూ నా యింటికి రావడం మానేశాడు. సంజీవరావుగారి అల్లరి కొంచెం మరుపొచ్చిందాకా పైనుందావఁని యీ వూరొచ్చాను. కరట : (ముక్కుమీద వేలుంచుకొని) గిరీశం నిన్నుంచుకున్నాడా? మా మేనల్లుడికి చదువు చెప్పడానిక్కుదురుకుని మావాళ్లింట్లో చేరాడు. వాడికి పెందరాళే ఉద్వాసన చప్పాలి. మధు : (ముక్కుమీద వేలు కొని) నా దగ్గరకు వచ్చినవాడల్లా చెడిపోయినాడో? నా దగ్గరకు మీరు రాకుండా అవరోధం కలిగిందని యిప్పుడే డిప్ట్ కలక్టరుగార్ని తిట్టారే, ఆయన కంటే మీ న్యాయం యేంబాగావుంది? నా దగ్గరకు వచ్చినందుకు, మీ భార్యాగారు ముందు మిమ్మల్ని మెడబట్టుకొని యింట్లోంచి తరవ్వఁలిసింది. తనకి రొట్టా, ఒహడికి ముక్కానా? కరట : క్రియలలో అంతవరకూ జరక్కపోయినా మాటల్లో అమర్యాద అమేషా నాకు జరుగుతూనే వున్నది. మధు : (చిరునవ్వుతో) యీ యిల్లాలు మా పంతులు కంటబడితే యీవిడ గుట్టు బట్టబయలౌతుంది. కరట : యిల్లాలనేస్తున్నావేఁం అప్పుడేను? కన్నెపిల్ల; దీన్ని పెండ్లి చెయ్యడానికే, నీ దగ్గరికి తీసుకొచ్చాను. కన్యాశుల్కము - మలికూర్పు గురుజాడలు 256