పుట:Gurujadalu.pdf/297

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

మధు : యేమి కల్పన! రామ : యింకా వుంది; యెహను కృష్ణా రాయపురంలో అగ్నిహోత్రావుఁధాన్లు కూతురు జాతక వెఁలావుందట? చప్పడానికి అలవి లేదు. అది కాలు పెట్టిన యిల్లు పది యిక్లౌతుందట. అదీ పట్టిందల్లా బంగారమౌతుందట! మధు : నిజవేఁనా లేక అదీ మీ బనాయింపేనా? రామ : అది మట్టుకు నా బనాయింపు కాదు, అగ్నిహోత్రావుఁధా జాతకం అలా బనాయిం చాడు. మా బ్రాహ్మల్లో యిదీ పరిపాటే, పెళ్లిళ్లలో పంపించేది ఒహ జాతకవూఁ నిజం వుండదు. మధు : యేమ్మోసం! రామ : లౌక్యం, లౌక్యవఁను. మధు : రెండింటికీ యేవిఁటో భేదం. రామ : నమ్మించోట చేస్తే మోసం, నమ్మంచోట చేస్తే లౌక్యవూఁను. మధు : తాను చేస్తే లౌక్యం, మరోడు చేస్తే మోసం అనరాదా? అబద్ధానికి అర్థవేఁవిఁటి? రామ : యావఁన్నావూ? అబద్ధవఁనా? ఉద్యోగధర్మం లౌక్యవృత్తి అని, అదివక వృత్తి భగవం తుడు కల్పించాడు. ఆ లౌక్య వృత్తి యెటువంటిదీ? నిజాన్ని పోలిన అబద్ధవాఁడి ద్రవ్యాకర్షణ చేసేది. యీ ధర్మసూక్ష్మాలు నీకెలా తెలుస్తాయి. మధు : నాకెలా తెలుస్తాయి. నిజవేఁగాని, ద్రవ్యాకర్షణ యలాగ యీ పెళ్లి వల్ల? రామ : (తనలో) క్రాసెగ్జామినేషను చేస్తూందోయి దీంతస్సా గొయ్యా (పైకి) నీకు మేజువాణి నిర్నయించుకున్నాను కానూ, నీకు పదిరూపాయల సొమ్ము దొరకడం ద్రవ్యాకర్షణ కాదా? మధు : యేంచిత్రవైఁన మనుష్యులు పంతులుగారూ! (తమలపాకు చుట్టతో కొట్టి) నేను రాబోతానని రెండేళ్ల కిందట కలగని, యీ కాబోయే మేజువాణీ బుద్ధిలో వుంచుకుని యీ పెళ్లి కావడానికి విశ్వప్రయత్నం చేశారూ! ద్రవ్యాకర్షణ యలాగో నాకు బోధపడ్డది. పెళ్లి కూతుర్ని యిలాకాచేసుకుని, దాం ద్వారా ముసలాడి మూటా ముళ్లాలాగేస్తారు. యంత సత్యకాల పదాన్నయినా ఆ మాత్రం ఊహించుకోగల్ను. లేకపోతే నేయంత బతిమాలుకున్నా యీ పెళ్లి తప్పించకపోవడవేఁOc? మీ బుద్ధికి అసాధ్యం వుందంటే నమ్ముతానా? కన్యాశుల్కము - మలికూర్పు గురుజాడలు 252