పుట:Gurujadalu.pdf/298

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

రామ : ఆ మాట్నిజవేఁ గాని, అన్ని పనులూ ద్రవ్యాకర్షణ కోసవేఁ చాస్తాననుకున్నావా యేవిఁ టి. ఆ ముసలాణ్ణి కాపాడదావఁనే యీ పెళ్లి తలపెట్టాను. మధు : “చిత్రం చిత్రం మహాచిత్రం” అని కథుంది, అలా వున్నాయి మీ చర్యలు! రామ : ఆ కథేదో చెబుదూ, నాక్కథలంటే మా సరదా. మధు : పొగటిపూట కథలేవిఁటి, ముందు యీ చిత్ర కథేవిండో శలవియ్యండి. రామ : అది చెప్పేది కాదు, చెప్పను. మధు : చప్పకపోతే వొప్పను. రామ : ఒప్పకేం జేస్తావు? మధు : యేం జేస్తానా? యీ జడతో కొడతాను. శాస్త్రంలో కాముకులకు చెప్పిన ఆయుధవింది. రామ : నేం దెబ్బలికి మనిషిని కాను. శాస్త్రం గీస్త్రం వొక పక్కనుంచి మోటసరసం మాను. చెప్పమంటే చెబుతాను గాని అలాంటి కబుర్లు నువ్వు వినకూడదు. మరేం లేదు. లుబావుఁధాన్లు వెధవకూతురు, మీనాక్షి ప్రవర్తన మంచిది కాదు. నాల్రోజుల కొహమారు అదీ పీకలమీదికి తెస్తూంటుంది. పోలీసువాళ్లు బెదిరించి పది డబ్బుల సొమ్ము లాగేస్తూంటారు. డబ్బు ఖర్చంటే ముసలాడికి, ప్రాణపోకట, సంసారం కూడా మీనాక్షి దూబర చేస్తుందంటాడు. పెళ్లయితే దాని ఆట కడుతుంది. మధు : మీనాక్షి ప్రవర్తన బాగుందీ కాదంటూ మీరే చెప్పాలీ? మీరు కంటపడ్డ తరవాత యే ఆడదాని ప్రవర్తన తిన్నగా వుంటుంది? అదుగో చూశావా? అలా అంటావనే కదూ చప్పనన్నాను. మధు : యీ చిక్కులు నాకేం తెలియవు. పెళ్లి మానిపించెయ్యండి. రామ : యీ పెళ్లిలో నీ మేజువాణీ పెట్టి పదిరాళ్లిప్పిస్తాను. మాటాడకూరుకో. మధు : (ముక్కు మీద వేలుంచుకొని) లుబ్ధావుధాన్లు యదట నేను మేజువాణీ ఆం! రామ పేరు వాడు గాని, సభలో పెద్దన్నేనే కదూ? (హేడ్ కనిస్టేబ్ చుట్ట కాలుస్తూ ప్రవేశించి కుర్చి మీద కూర్చొనును.) హెడ్ : రామఁప్పంతులూ! యినస్పెక్టరికే టోపీ వేశావటే? రామ (హెడ్ కనిస్టేబు చెవిలో) గారూ గారూ అనవయ్యా. హెడ్ : యెప్పుడూ లేంది గారేవిఁటి, గీరేవిఁటి, చింతగారు? రామ : ఆడవాళ్ళున్న చోటికి తోసుకు రావడవేఁనా, అన్నా! కన్యాశుల్కము - మలికూర్పు రామ

గురుజాడలు 253