పుట:Gurujadalu.pdf/296

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

మోటతనం! రామ రామ : అంతా సిద్ధవైరం తరవాత, నాశక్యమా ఆపడానికి? (బలాత్కారంగా ముద్దు బెట్టుకొనును. ) మధు : సత్తువుందనా మోటతనం? రామ : నా సత్తువిప్పుడేం జూశావ్, చిన్నతనంలో ధ్వజస్తంభం దండతో కొడితే గణగణమని గంటలన్నీ ఒక గడియ వాగేవి. నాడు జబ్బు చేసిం దగ్గర్నుంచీ డీలా అయిపోయినాను. మధు : యిదా డీలా? నా చేయి చూడండీ యలా కందిపోయిందో. అన్నా,

చేప చిరిగినా చేదరంతని, నీ ప్రాణానికి యిప్పటి సత్తువే ఉద్గాలం లా కనపడుతూంది.

మధు : యీ పెళ్ళి మాన్పించకపోతే నేను మీతో మాట్లాడను. రామ : వెట్టి కుదిరింది, రోకలి తలకి చుట్టమన్నాట్ట! రెండేళ్ళాయి ఆ ముసలి గాడిదకొడుకు మీద నా లౌక్య ప్రజ్ఞంతా వినియోగపర్చి పెళ్లి సిద్ధం చేసి యిప్పుడెలా తప్పించడం? మధు : యేం లౌక్యం చేశారు? రామ : అలా అడుగు. నా బుద్ధి సత్తువ కూడా నీకు తెలుస్తుంది. లుబ్ధావుధాన్లు పరమలోభి, వాడి గుణం యిలా వుండబోతుందని పోల్చారేమో అన్నట్టు చిన్నతనంలో వాడికి పేరు పెట్టారు. పెళ్లాడితే వొల్లమాల్ని ధనం వొస్తుందని ఆశ పెట్టించాను. మధు : యలా చేశారీ మహా చిత్రం? పెళ్లితే ధనం ఖర్చౌతుంది గానీ, రావడవెఁలాగ. రామ : లౌక్యవఁంటే మరేవిఁటనుకున్నావు? అసాధ్యాలు సాధ్యం, సాధ్యాలు అసాధ్యం చెయ్య డవేఁ కదూ? మన సిద్ధాంతిని దువ్వేటప్పటికి వాడేంజేశాడనుకున్నావు? లుబ్ధావుధాన్లు జాతకం యగాదిగా చూసి, సీఘ్రంలో వివాహయోగం వుఁందన్నాడు, ఆ వివాహం వల్ల ధనయోగ వుఁందన్నాడు. దాంతో ముసలాడికి డబ్బొస్తుందన్న ఆశ ముందుకీ, డబ్బు ఖర్చౌతుందన్న భయం వెనక్కి లాగడం ఆరంభించింది. యింతట్లో పండాగారిక్కడి కొచ్చారు. ఆయన్ని కూడా తయారు చేశాను. లుబావుధాన్లు అనుమానం తీర్చుకుందావఁ ని ఆయనికి జాతకం చూపించే సరికి పండాగారు యేమన్నారూ? “వివాహ ధనయోగాలు జవిఁలిగా వున్నాయి, అయితే మీరు పెద్దవాళ్లు, యిప్పుడు మీకు పిల్ల నెవరిస్తారు, పెళ్లెలా అవుతుంది? యిలాంటి జరగడానికి వీల్లేని మహాయోగాలు జాతకాల్లో పట్టినప్పుడు, గొప్ప మేలుకు బదులుగా గొప్ప కీడు సంభవిస్తుంది. అనగా మీకు మార్కవోఁ ధననష్టవోఁ సంభవిస్తుంది. గ్రహశాంతి చేసి బ్రాహ్మణ భోజనం బాహుళ్యంగా చెయ్యండి. కొంత్త జబ్బో గిబ్బో చేసి అంతటితో అరిష్టం పోతుంది. మంచి రోజు చూసి సూర్యనమస్కారాలు ఆరంభించండి” అని చెప్పేసరికి అవుఁ ధాన్లు గుండ రెండు చక్కలై వివాహ ప్రయత్నం ఆరంభించాడు. యిదీ కథ. కన్యాశుల్కము - మలికూర్పు గురుజాడలు 251