పుట:Gurujadalu.pdf/295

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

రామ : యేవిఁటో ఆ మోసపోవడం? తరవాత ముక్కేవింటి, పాడూ. మధు : తరవాత ముక్కకేవుఁంది, మిమ్మల్ని నమ్మి మోసపోయినాను. రామ : అదేం అలా అంటున్నావు? నిన్ను మోసపుచ్చ లేదే? నిర్నయ ప్రకారం రెండొందలూ పట్టంలో యిచ్చాను. నెలజీతం నెలకు ముందే యిచ్చాను. యిహ మోస వేఁవుఁంది? మధు : యేం చిత్రంగా మాట్లాడతారు పంతులు గారూ, నాకు డబ్బే ప్రధానవైఁనట్టు మీ మనుసుకి పొడగడుతూంది కాబోలు, నాకు డబ్బు గడ్డిపరక. మీ భూవుఁలు రుణాక్రాంతవైఁనాయని అప్పట్లో నాకు తెలిశుంటే మీ దగ్గర రెండొందలూ పుచ్చు కొందునా? మీరు ఖర్చు వెచ్చాలు తగ్గించుకుని సంసారం బాగు చేసుకోకపోతే నేను మాత్రం వొప్పేదాన్ని కాను. ఫలానా పంతులుగారు ఫలనా సాన్నుంచుకుని బాగు పడ్డారం టేనే నాకు ప్రతిష్ఠ. మా యింటి సాంప్రదాయం ఇది పంతులు గారూ; అంతేకాని లోకంలో సార్లమచ్చని వూహించకండి. రామ : భూవుఁలు తణఖా అన్నమాట శుద్ధ అబద్ధం, యవరన్నారో గాని; నేను మహరాజులా వున్నాను. మధు : నాకంటికి మహరాజులా కనపడబట్టే యిల్లూ వాకలీ వొదిలి మానం ప్రాణం మీ పాలు చేసి నమ్మి మీ వెంట వొచ్చాను. నన్ను మోసం మాత్రం చెయ్యకండీ; మిమ్మల్ని పాపం చుట్టుకుంటుంది. రామ : నేను మోసం చేసే మనిషినేనా? మధు : ఆలాగయితే లుబావుధాన్లు గారికి పెళ్లేందుకు కుదిర్చారు? నాకు తెలియదనుకున్నారా యేవిఁటి? ఆ ముసలాడికి పెళ్లెందుకు? మీ కోసవేఁ యీ యెత్తంతాను. రామ : ఆహా! హా! హా! యిదా అనుమానం! కొంచెం గెడ్డం నెరుస్తూంది, నన్ను కూడా ముసలాజ్ఞంటావా యేవిఁటి? మధు : చెట్లకి చావ నలుపు, మనిషికి చావ తెలుపూ. అనగా చీకట్లో నక్షత్రాల్లాగ, అక్కడక్కడ తెల్లవెంట్రుక తగిలేనే చమక్. రామ : స్వారస్యం మాచమత్కారంగా తీశావ్! యేదీ ముద్దు (రామప్పంతులు మధురవాణిని ముద్దు బెట్టుకో బోవును.) మధు : (చేతులతో అడ్డి ముఖము ఓరజేసుకొని) వేళాపాళా లేదా? లుబ్ధావుధాన్లు పెళ్ళి తప్పించేస్తే గానీ నేను ముద్దు బెట్టుకోనివ్వను. గురుజాడలు కన్యాశుల్కము - మలికూర్పు 250