పుట:Gurujadalu.pdf/294

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

బుచ్చ : నాన్నా! అమ్మ స్తానం చెయ్యమంచూంది. అగ్ని : వెధవముండా సొద! పెద్ద మనుష్యులో వ్యవహారం మాట్లాడుతూంటే రామాయణంలో పిడకల వేట్లాటలాగ అదే పిలవడవాం! గిరీశం: తప్పకుండా క్రిమినెల్కేసు తావలిశిందే, క్రిమినలో శిజ్యూర్ కోడు 171 శక్షన్ ప్రకారం తెద్దావాఁ? 172 డోశక్షన్ ప్రకారం తెద్దావాఁ? అగ్ని : రెండు శక్షన్లూ తాలేవేం? గిరీశం: నేరంగల ప్రవేశం, ఆక్రమణ రెండు శక్షన్లూ కూడా ఉపచరిస్తాయి. సరే గదా కళ్లతో చూశాను గనక యీ గోడ మీదయినట్టు జల్లీ గ బొడిచి సాక్ష్యం కూడా పలగ్గలను, యీ గోడ స్పష్టంగా మీదాన్లాగే కనపడుతూంది. అగ్ని : అందుకు సందేహం వుఁందండీ, యేమరిచి యిన్నాళ్ళు వూరుకున్నాను. పెరటిగోడ కూడా చూతురుగా నండి. అక్కా బత్తుడి ముక్కు నులిపి గెల్చుకున్నాను. కాని యీ దావాల కింద సిరిపురం భూవిఁ అమ్మెయ్యవలసి వొచ్చిందండి, రావాఁవధాన్లు కేసు కూడా గెలిస్తే, ఆ విచారం నాకు లేకపోవును. (అందరు నిష్క్రమింతురు.) కన్యాశుల్కము తృతీయాంకము వస్థలము. రామచంద్రపురం అగ్రహారంలో రామప్పంతులు యింట్లో సావిట్లో గది (మధురవాణి ప్రవేశించును) మధు : ఈ రామప్పంతులు కథ పైకి పటారం, లోపల లొటారంలా కనిపిస్తుంది. భూవుఁ లన్నీ తాకట్టుపడి వున్నాయిట; మరి రుణం కూడా పుట్టదట. వాళ్లకీ వీళ్లకీ జుట్లు ముడేసి జీవనం జేస్తున్నాడు. యీ వూరు వేగం సవిరించి చెయ్ చిక్కినంత సొమ్ము చిక్కించుకుని పెందరాళే మరో కొమ్మ పట్టుకోవాలి. (పాడును) తెలియక మోసపోతినే, తెలియక' (పాడుతుండగా రామప్పంతులు ప్రవేశించును) కన్యాశుల్కము - మలికూర్పు గురుజాడలు 249