పుట:Gurujadalu.pdf/287

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

కరట : యిదుగో యీ పుస్తకం పట్టుకు ప్రమాణం చేస్తున్నాను. శిష్యు : యీ పుస్తకం మీద నాకు నమ్మకం పోయింది. మరో గట్టి ప్రమాణం చెయ్యండి. గిరీశంగారిని అడిగి ఒక యింగిలీషు పుస్తకం పట్టుకురానా? కరట : తప్పితే భూమితో డ్రా. శిష్యు : మీరు యగేస్తే భూవేలం జేస్తుంది? మీ మాటే చాలును కానీండి. 3వ స్థలము : అగ్నిహోత్రావుధాన్లు యింటి యదటి వీధి (గిరీశం, వెంకటేశం ప్రవేశింతురు.) వెంక : రాత్రి కన్యాశుల్కం మీద లెక్చరిచ్చారా? గిరీశం: లెక్చరేవిఁటోయ్, ధణు తెగిరిపోయింది. మీ తండ్రిది మైరావణ చరిత్రోయ్. మీ అంకుల్ కరటక శాస్త్రి ఫౌండ్రల్లా కనపడుతున్నాడు. వెంక : యేం జరిగిందేం జరిగిందేవిఁటి ? గిరీశం: విను. రాత్రి భోజనాల వేళ లెక్చరు ఆరంభించమని రోజుల్లా బురిడీలు పెట్టాడోయి మీ మావం. సబ్జక్టు నేను కొంచెం యెత్తగానే తను కూడా గట్టిగా సపోర్టు చేస్తానని హోమిస్ కూడా చేశాడు. నీ తండ్రి వైఖరీ చూస్తే మాత్రం కొంచం ధైర్యం వెనకాడి నాలిక్కొసకొచ్చిన మాట మళ్లీ మణిగి పోతూండేది. పెరుగూ అన్నం కలుపుకునే వేళకి యిక టైమ్మించి పోతూందని తెగించి లెక్చరు ఆరంభించాను. ఇంట్రడక్షన్ రెండు సెంటెన్సులు యింకా చెప్పనే లేదు నాలుగు యింగ్లీషు మాటలు దొల్లాయోయ్. దాంతో నీ తండ్రి కళ్లె జేశి “యీ వెధవ యింగ్లీషు చదువునించి బ్రాహ్మణ్యం చెడి పోతూంది; దేవభాషలాగ భోజనాల దగ్గర కూడా ఆ మాటలే కూస్తారు; సంధ్యావందనం శ్రీసూక్త పురుష సూక్తాలూ తగలబడిపోయినాయి సరే గదా? ” అని గట్టిగా కేక వేసి చెప్పేసరికి నేను కొంచం పస్తాయించి “థేయింగ్ పెల్సు బిఫోర్ స్వైన్” అనుకొని కరటకశాస్తులు వేపు చూసే సరికి యెంచేస్తున్నాడనుకున్నావ్ ? రాస్కెల్ వులకలేదు, పలక లేదు, సరేకదా మొహం పక్కకి తిప్పి కడుప్పగిలేటట్టు నవ్వుతున్నాడు. యిక లెక్చరు వెళ్లింది కాదు సరే కదా, నోట్లోకి ముద్ద కూడా వెళ్లింది కాదు. ఛీ యింత యిన్సల్టు జరిగింతరవాత తక్షణం బయలుదేరి వెళ్లిపోదావఁనుకున్నాను. వెంక : అయ్యో వెళ్ళిపోతారా యేవిఁటి? గిరీశం: నాటింది లీష్టు. కొసాకీ విను, నీ తండ్రిని పోకెట్లో వేశాను. కన్యాశుల్కము - మలికూర్పు గురుజాడలు 242