పుట:Gurujadalu.pdf/286

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

శిష్యు : చిత్తం (పుస్తకం మూయును.) కరట : చదువన్నదెందుకు పొట్ట పోషించుకోడానిగ్గదా ? శిష్యుడు: అవును. కరట : యీ రోజుల్లో నీ సంస్కృత చదువెవడికి క్కావాలి? శిష్యు : దరిద్రులిక్కావాలి. కరట : బాగా చెప్పావు. నీకు యింగ్లీషు చదువుకోవాల్నుందో? శిష్యు : చెప్పించే దాతేడీ? కరట : నేను చెప్పిస్తానా. శిష్యు : నిజంగాను? కరట : నిజంగా శ్రా, గాని ఒక షరతుంది. శిష్యు : యెవిఁటండి? కరట : నాకో కష్టసాధ్యమైన రాచకార్యం తటస్థించింది. అదీ నిర్వహించి నువ్ చేసుకురావాలి. శిష్యు : నా వల్లయే రాచకార్యాలు కూడా వున్నాయా? కరట : యీ రాచకార్యం నీ వల్లే కావాలి. మరెవడి వల్లా కాదు. అదేవిఁటంటే, ఓ పది రోజులు నువ్వు ఆడపిల్లవై పోవాలి. శిష్యు : గణియం పట్టంలో వుండి పోయిందే? కరట : అట్టే గణియం అవసరం లేదు. నీకు తలదువ్వి, కోకకడితే పజ్యండేళ్ళ కన్నెపిల్లలా వుంటావు. నిన్ను తీసుకెళ్లి లుబ్ధావధానికి పెళ్లి చేస్తాను. నాలుగు పూటలు వాళ్లింట నిపుణతగా మెసిలి, వేషం విప్పేశి పారిపోయిరా. నిజవ్కైన పెళ్లి ముహర్తం చాలా వ్యవధుంది. శిష్యు : యిదెంతపని. కరట : అలా అనుకోకు, అతి చేసి వట్టాయనా, అనుమానపడతారు. పట్టుబడ్డావంటే పీక తెగిపోతుంది. శిష్యు : మీకా భయం వొద్దు. కరట : నువ్వు నెగ్గుకొస్తే, మా పిల్లన్నీకిచ్చి యిల్లరికం వుంచుకుంటాను. శిష్యు : అలా ప్రమాణం చెయ్యండి. గురుజాడలు 241 కన్యాశుల్కము - మలికూర్పు