పుట:Gurujadalu.pdf/288

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

వెంక : నా తండ్రికి లెక్చరిచ్చి పెళ్ళి తప్పిస్తావఁన్నారే? గిరీశం: పెళ్ళి ఆపడానికి బ్రహ్మశక్యం కాదు. డిమార్గనీసు, సురేంద్రనాథ్ బానర్జి వచ్చి చెప్పినా నీ తండ్రి యీ పెళ్లి మానడు. లెక్చర్లు యంత సేపూ సిటీల్లోనే గాని పల్లిటూళ్లలో యంతమాత్రం పనికిరావు. పూనాలాంటి సిటీలో లెక్చర్ యిచ్చావంఁటే టెంథెజండు పీపిల్ విండానికి వొస్తారు. మన టౌన్లోనే, పెద్ద మీటింగులు చెయ్యాలంటే, డప్పులు బజాయించి, నోటీసులు కట్టి, బజార్లు కాసి, తోవంట పోయేవాళ్లని యీడ్చుకు వొచ్చినా, యాభైమంది కారు. పల్లెటూరి పీపిల్ లెక్చర్లకి అఫిట్. మొన్న మనం వొచ్చిన బండీ వాడికి నాషనల్ కాంగ్రెస్ విషయమైఁ రెండు ఘంటలు లెక్చర్ యిచ్చేసరికి ఆ గాడిద కొడుకు, వాళ్లవూరు హెడ్ కానిస్లేబిల్ని కాంగ్రెస్ వారు యెప్పుడు బదిలీ చేస్తారని అడిగాడు! విలేజలో లెక్చర్లు యంతమాత్రం కార్యం లేదు. నీ తండ్రి దగ్గర మాత్రం లెక్చరన్న మాట కూడా అనకూడదు. వెంక : అయితే, నాన్నని యలాగ జేబులో వేశారేవిఁటి? గిరీశం: అది పోలిటిక్సు దెబ్బోయ్! ఆ తరవాత కథ విను. నా మీద కాకలేసిన తరవాత కోపం వణక్క ధుమధుమ లాడుకుంటూ, పెరుగూ అన్నం కుమ్మడం ఆరంభించాడు. ఇంతలో మీ అప్పజొచ్చి గుమ్మం దగ్గర నిలబడి కోకిల కంఠంతో “నాన్నా తమ్ముడికి పెళ్ళి చెయ్యాలంటే నా సొమ్ము పెట్టి పెళ్లి చెయ్యండి గాని దాని కొంపముంచి లుబ్ధావుల ధాన్లుఁకి ఇవ్వొద్దని” చెప్పింది. దాంతో నీ తండ్రికి వెట్టికోపం వొచ్చి వుత్తరాపోసనం పట్టకుండానే ఆ పెరుగూ అన్నంతో విస్తరి తీసికెళ్ళి దాన్నెత్తిని రుద్దేశాడు! కరటకశాస్తులు అడ్డుపడబోతే చెంబుతో నీళ్లు వాడి నెత్తిందిమ్మరించాడు. కరటక శాస్తుల్లుకి కోపం వొచ్చి శిష్యుణ్ణి తీసుకు వాళ్ల వూరెళ్లి పోయినాడు. వెంక : దీని పేరేనా యేవిఁటి మా నాన్నం జేబులో వేసుకోవడం? గిరీశం: పేషన్స్! కొసాకీ విను. స్కౌంట్రోల్ కరటక శాస్త్రుల్లు వెళ్లిపోయినాడని సంతోషించాను గాని, నీ సిస్టర్ ఫేట్ విషయవైఁ మహా విచారవైఁంది. నేనే దాని హజ్బెండ్నై వుంటే, నిలబడ్డపాటున నీ తండ్రిని రివాల్వర్తో షూట్ చేశివుందును. మీ అమ్మ యేడుస్తూ ఒక మూల కూచుంది. అప్పుల్లే వెళ్లి నీళ్ల పొయిలో నిప్పేసి, నీళ్లు తోడి, నీ సిస్టర్ని స్తానం చెయమన్నాను. సిగర్సు కాల్చుకుందావఁని అరుగుమీద నేను బిచాణా వేసేసరికి, నీ తండ్రికి పశ్యాత్తాపం వొచ్చి, తానూ ఆ అరుగు మీదే బిచాణా వేసి, ఒక్క సిగరయినా కాల్చనియ్యకుండా రాష్ట్రాల్లా కబుర్లలో పెట్టి చంపాడాయ్. మొత్తానికి కత్తు కలిపేశాను. వెంక : యాలక్కలిపారేవిఁటి? కన్యాశుల్కము - మలికూర్పు గురుజాడలు 243