పుట:Gurujadalu.pdf/278

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

గిరీశం: అందుకభ్యంతర వేఁవింటమ్మా, మీ వాడు శలవుల్లో చదువుచెప్పమని యంతో బతిమాలు కుంటే పోనీ పనికొచ్చే కుఱ్ఱవాడు గదా అని వొచ్చానుగాని, పట్టంలో మునసబు గారింట భోజనం చేదని వొచ్చానా వారిచ్చే డబ్బు చేదని వొచ్చానా అమ్మా? వెంకమ్మ : యీ చదువులకోసవఁని పిల్లణ్ణి వొదులుకుని వుండడం, వాడు పరాయి వూళ్ళో శ్రమదమాలు పడుతూండ్డం నా ప్రాణాలు యెప్పుడూ అక్కడ్లే వుంఛాయి. డబ్బంటే యెన్నడూ వెనక చూళ్లేదు గదా, మేం కనడం మట్టుకు కన్నాం. మీరే వాడికి తల్లీ తండ్రిని. యలా కడుపులో పెట్టుకు చదువు చెబుతారో మీదే భారం. గిరీశం: తమరు యింత దూరం శలవియ్యాలమ్మా? నా మంచి చెడ్డలు మీ కుఱ్ఱవాజ్ఞడిగితే తెలుస్తుంది. మునసబుగారూ, డిప్ట్ కలక్టరుగారూ యెన్నిక చేసిన మనిషిని. నా మాట నే చెప్పుకోవాలా, ఇంతెందుకూ, యిక మూడేళ్లు నాతరిఫీదులో వుంచితే క్రిమినల్లో వరసగా పోలీసు పరిక్ష పాసు చేయిస్తాను. అగ్ని : మూడేళ్ళే! యీ సంవత్సరం పుస్తకాల కెంతవుతుందిరా అబ్బీ ? వెంకటేశం : పదిహేగ్రూపాయలవుతుంది. అగ్ని : ఒక్క దమ్మిడీ యివ్వను. వీళ్లిద్దరూ కూడి ఆ రూపాయలు పంచుకు తినేటట్టు కనపడు చూంది. నేను వేదం యనభై రెండు పన్నాలూ ఒహదమ్మిడీ పుస్తకాల ఖర్చు లేకుండా చదువుకున్నాను. ఇదంతా టోపీ వ్యవహారంలా కనపడుతుంది. కరటక: (నవ్వుతూ) కోట్లకి విలవైన మాట అన్నావు బావా! గిరీశం: (కరటకశాస్త్రితో) దిసీజ్ బార్బరస్, చూచారండీ, జెంటిల్మేన్ అనగా పెద్దమనిషిని యలా అంటున్నారో! నేను యిక యిక్కడ వుండడం భావ్యం కాదు, శలవు పుచ్చుకుంటాను. వెంకమ్మ : చాల్చాలు బాగానే వుంది! యింటికెవరొచ్చినా నాకిదే భయం, ఆయన మాటలకెక్కడికి బాబూ, వెళ్లిపోకండి. కరటక: అగ్నిహోత్రావుధాన్లు! కుఱ్ఱవాడికి రవ్వంత చదువు చెప్పించడానికి ఇంత ముందూ వెనకా చూస్తున్నావ్, బుచ్చమ్మనమ్మిన పదిహేనువొందల రూపాయలేంజేశావ్? గిరీశం: సెల్లింగ్టగ్స్! డామిటి? అగ్ని : ఎ గాడిదె కొడుకూ అమ్మావంమ్మా వంచూంఛాడు. కూరగాయల్లోయ్ అమ్మడానికీ ? ఆ రూపాయలు పుచ్చుకోకపోతే మొగుడు చచ్చాడు గదా, దాని గతి యావైఁ య్యుండును? గురుజాడలు 233 కన్యాశుల్కము - మలికూర్పు