పుట:Gurujadalu.pdf/277

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

కరటకశాస్త్రి: నీ భూవెఁందు కమ్మాలమ్మా! మన సొమ్ము చెడతిని కొవ్వున్నాడు, అతడే పెట్టుకుంటాడు. అగ్ని : ఐతే నన్ను ఆక్షేపణ చేస్తావమే? యీ మారంటే నీ అన్న వున్నాడని వూరుకునేది లేదు. (గిరీశం వెంకటేశం ప్రవేశింతురు. ) వెంక : మాబాబ్మాబాబు వచ్చావషాయ్! (వెంకటేశమును కాగలించుకొనును.) అగ్నిహో: వెధవాయా యీ మారైనా పాసయినావా? (వెంకటేశం తెల్లబోయి చూచును) గిరీశం: పాసయినాడండి, ఫస్టుగా పాసయినాడు. నేను చాలా శ్రమపడి చదువు చెప్పానండి. అగ్ని : యీ తురకెవడోయ్? గిరీశం: టర్క్! డామిట్, టెల్ మాన్. అగ్ని : మానా? మానులా వుంచా నంఛావూ? గూబ్బగలగొడతాను. వెంకటేశం : (వణుకుతూ తల్లి వేపు చూసి) అమ్మా యీయ్నే నాకు చదువు చెప్పే మేష్టరు. కరటక: ఇంటికి పెద్దమనిషాస్తే అపృచ్ఛపు మాటలాడతావేవిఁటి బావా? ఆయనేదో కుఱ్ఱవాడితో యింగిలీషు మాటంటే పుచ్చకాయల దొంగంటే బుజాలడువుఁకున్నట్టు నీ మీద పెట్టుకుంటావేం? (బండివాడు సామాను దించును) గిరీశం: (కరటకశాస్త్రితో) తమ బావగారా అగ్నిహోత్రావఁధాన్లుగారు? నన్ను తమరు యరక్కపోవచ్చును గాని, డిప్ట్ కలక్టరు గారింటికి తమరు వచ్చేటప్పుడు నేను వారి పిల్లలికి చదువు చెబుతూ వుండేవాణ్ణి. డిప్ట్ కలక్టరుగారు తమర్ని యేమ్మెచ్చుకునే వారనుకుంటారు! కరటక: అవును మీ మొఖం చూసిన జ్ఞాపకవుఁంది. డిప్ట్ కలక్టరు గారు హదొడ్డ ప్రభువ్. గిరీశం: మీలాంటి చప్పన్న భాషలూ వచ్చిన మనిషిని యక్కడా లేడనీ, సంస్కృతం మంచి నీళ్ల ప్రవాహంలా తమరు మాట్లాడతారనీ, తమలాంటి విదూషకుణ్ణి యక్కడా చూళ్లేదనీ డిప్ట్ కలక్టరుగారు శలవిస్తూండేవారు. కవితారసం ఆయన్లా గ్రేహించేవారేరీ? నా కవిత్వవఁంటే ఆయ్న చెవికోసుకుంటారు. మహారాజావారి దర్శనం కూడా నాకు చెయించారండి. అగ్ని : (ధుమధుమలాడుతూ) ఈ శషభిషలు నాకేం పనికిరావు. యితడి వైఖరి చూస్తే యిక్కడే బసవేసేటట్టు కనపడుతూంది. మా యింట్లో భోజనం యంత మాత్రం వీలుపడదు. వెంక : ఆయన మాటలు గణించకు బాబూ, ఆయన మోస్తరది. మీదయవల్ల మా వాడికో ముక్కబ్బితే మీ మేలు మరిచిపోం. గురుజాడలు 232 కన్యాశుల్కము - మలికూర్పు